1 Chronicles 9:24
ఇలా కాపలా కాసేవారు గుడారం నాలుగు దిక్కుల్లో తూర్పు వైపునా, పడమర వైపునా, ఉత్తరం వైపునా, దక్షిణం వైపునా నిలుచున్నారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In four quarters were the porters, toward the east, west, north, and south.
In Context
23వాళ్ళూ వాళ్ళ కొడుకులూ యెహోవా మందిర ద్వారాల దగ్గర, అంటే ప్రత్యక్ష గుడారం ద్వారాల దగ్గర కాపలా కాశారు.
25గ్రామాలనుండి వాళ్ళ బంధువులు వాళ్ళ క్రమంలో ఏడు రోజులకోసారి వాళ్ళ దగ్గరికి వచ్చి సహాయం చేసేవాళ్ళు.
Cross References
2 Chronicles 8:14అతడు తన తండ్రి దావీదు జారీ చేసిన ఆజ్ఞలననుసరించి వారి వారి సేవా కార్యాలు చేయడానికి వారి వారి వంతుల ప్రకారం యాజకులనూ, కట్టడను అనుసరించి ప్రతి రోజూ యాజకుల ముందు స్తుతి చేయడానికీ ఉపచారం చేయడానికీ వారి వంతుల ప్రకారం లేవీయులనూ ప్రతి ద్వారం దగ్గరా కాపలా ఉండడానికి వారి వంతుల ప్రకారం ద్వారపాలకులనూ నియమించాడు. దైవసేవకుడు దావీదు ఆ విధంగానే ఆజ్ఞాపించాడు.