1 రాజులు 2:22
అందుకు సొలొమోను “షూనేమీయురాలైన అబీషగును మాత్రమే అదోనీయా కోసం ఎందుకు అడుగుతున్నావు? అతడు నా అన్న కాబట్టి అతని కోసం, యాజకుడు అబ్యాతారు కోసం, సెరూయా కొడుకు యోవాబు కోసం రాజ్యాన్నే అడగవచ్చు కదా” అని తన తల్లితో అన్నాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
21అప్పుడామె “నీ అన్న అదోనీయాకి షూనేమీయురాలైన అబీషగుని పెళ్లాడనీ” అంది.
Cross References
2 Samuel 12:8అతడి స్త్రీలను నీ కౌగిటిలోకి చేర్చాను. ఇశ్రాయేలు వారిపై, యూదా వారిపై నీకు అధికారం అప్పగించాను. నువ్వు గనుక ఇది చాలదని భావిస్తే నేను ఇంకా ఎక్కువగా నీకు ఇచ్చి ఉండేవాడిని.
1 Kings 1:5ఆ సమయంలో దావీదుకు హగ్గీతు వల్ల పుట్టిన అదోనీయా గర్వించి “నేనే రాజునవుతాను” అనుకున్నాడు. కాబట్టి అతడు రథాలనూ గుర్రపు రౌతులనూ తన ఎదుట పరిగెత్తడానికి 50 మంది మనుషులనూ ఏర్పాటు చేసుకున్నాడు.
1 Kings 1:11అప్పుడు నాతాను సొలొమోను తల్లి బత్షెబతో ఇలా చెప్పాడు. “హగ్గీతు కొడుకు అదోనీయా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడన్న సంగతి నీకు వినబడలేదా? కాని ఈ సంగతి మన యజమాని అయిన దావీదుకు తెలియదు.
1 Chronicles 3:2మూడవ వాడు అబ్షాలోము. ఇతని తల్లి పేరు మయకా. ఈమె గెషూరు దేశానికి రాజు తల్మయి కూతురు. నాలుగో వాడు అదోనీయా. ఇతని తల్లి పేరు హగ్గీతు.
Matthew 20:22అందుకు యేసు, “మీరు ఏమి అడుగుతున్నారో మీకు తెలియడం లేదు. నేను తాగబోయే గిన్నెలోది మీరు తాగగలరా?” అని వారిని అడగగా వారు “తాగగలం” అన్నారు.
James 4:3మీరడిగినా మీకేమీ దొరకదు. ఎందుకంటే మీ సుఖభోగాల కోసం ఖర్చు చేసేందుకు చెడ్డ వాటిని అడుగుతారు.