bible.software › 1 సమూ › 1 సమూ 20 › 1 సమూ 20:30
1 సమూ 20:30
సౌలు యోనాతానుపై తీవ్రంగా కోపగించి “వక్రబుద్ధి గల తిరుగుబోతుదాని కొడుకా, నీకూ నీ తల్లికీ అవమానం కలిగేలా నువ్వు యెష్షయి కుమారుణ్ణి స్నేహితుడిగా ఎంచుకొన్న సంగతి నాకు తెలియదా?
బైబిల్ (తెలుగు)
In The King James Version
Then Saul’s anger was kindled against Jonathan, and he said unto him, Thou son of the perverse rebellious woman, do not I know that thou hast chosen the son of Jesse to thine own confusion, and unto the confusion of thy mother’s nakedness?
In Context
29దయచేసి నన్ను వెళ్లనివ్వు, పట్టణంలో మా యింటివారు బలి అర్పించబోతున్నారు, నువ్వు కూడా రావాలని మా అన్న నాకు కబురు పంపాడు. కాబట్టి నాపై దయ చూపించి నేను వెళ్లి నా సోదరులను కలుసుకోనేలా నాకు సెలవిమ్మని బతిమాలుకుని నా దగ్గర సెలవు తీసుకున్నాడు. అందువల్లనే అతడు రాజుగారి భోజనపు బల్ల దగ్గరికి రాలేదు” అని సౌలుతో చెప్పాడు.
31యెష్షయి కొడుకు భూమిమీద బతికి ఉన్నంత కాలం నువ్వైనా, నీ రాజ్యమైనా స్థిరంగా ఉండవని నీకు తెలుసు గదా. కాబట్టి నువ్వు కబురు పంపి అతణ్ణి నా దగ్గరికి రప్పించు. నిజంగా అతడు చనిపోవలసిందే” అన్నాడు.
Read all of 1 సమూ 20
Cross References
Proverbs 14:29వివేకం గలవాడు త్వరగా కోపం తెచ్చుకోడు. ముక్కోపికి మూర్ఖత్వమే బహుమతిగా దక్కుతుంది.
Proverbs 19:12రాజు కోపం సింహగర్జన లాంటిది. అతని అనుగ్రహం గడ్డి మీద కురిసే మంచు లాంటిది.
Proverbs 21:24అహంకారి, గర్విష్టి-అతనికి అపహాసకుడు అని పేరు. అలాంటివాడు గర్వంతో మిడిసి పడతాడు.
Proverbs 27:3రాయి బరువు ఇసక భారం గదా. మూర్ఖుడి కోపం ఆ రెంటికంటే బరువు.
Ephesians 4:31సమస్తమైన దుష్టత్వంతోబాటు ద్వేషం, కోపం, రౌద్రం, అల్లరి, దూషణ అనే వాటిని పూర్తిగా విడిచిపెట్టండి.
James 1:19నా ప్రియ సోదరులారా, ప్రతివాడూ వినడానికి తొందరపడాలి. మాట్లాడడానికీ, కోపానికీ నిదానించాలి. ఇది మీకు తెలుసు.
This Verse In Other Editions
Study 1 సమూ 20:30