1 Samuel 22:2
ఇబ్బందుల్లో ఉన్నవారు, అప్పుల పాలైన వాళ్ళు, అసంతృప్తిగా ఉన్నవాళ్ళంతా అతని దగ్గరికి వచ్చి చేరారు. అతడు వారికి నాయకుడయ్యాడు. అతని దగ్గర దాదాపు 400 మంది చేరారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Judges 18:25దాను గోత్రం వారు అతనితో “జాగ్రత్త! నీ స్వరం మా వాళ్లకు ఎవరికీ వినపడనీయకు. వాళ్ళకు నీమీద కోపం వచ్చిందంటే నీమీద దాడి చేసి నిన్నూ నీ కుటుంబాన్నీ చంపేస్తారు” అన్నారు.
1 Samuel 9:16ఎందుకంటే “నా ప్రజల విన్నపం నాకు చేరింది. నేను వారిని పట్టించుకొంటున్నాను. కాబట్టి ఫిలిష్తీయుల చేతిలోనుండి నా ప్రజలను విడిపించడానికి నా ప్రజలైన ఇశ్రాయేలీయులపై అతణ్ణి రాజుగా అభిషేకించడానికి రేపు ఇదే సమయానికి నేను బెన్యామీను దేశంలో నుండి ఒక వ్యక్తిని నీ దగ్గరికి రప్పిస్తాను.”
1 Samuel 25:13అప్పుడు దావీదు వారితో “మీరంతా నడుముకు కత్తులు ధరించుకోండి” అని చెప్పాడు. వారు కత్తులు ధరించుకున్నారు. దావీదు కూడా ఒక కత్తి ధరించాడు. దావీదుతో పాటు దాదాపు 400 మంది బయలుదేరారు. 200 మంది సామాను దగ్గర ఉన్నారు.
1 Samuel 30:6దావీదు చాలా దుఃఖపడ్డాడు. తమ తమ కొడుకులూ కూతుర్లను బట్టి వారందరికీ ప్రాణం విసికి పోయి దావీదును రాళ్లు రువ్వి చంపాలని చెప్పుకున్నారు. దావీదు తన దేవుడు, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు.
1 Samuel 30:24మీరంటున్నది ఎవరు ఒప్పుకుంటారు? యుద్దానికి పోయినవాడికీ సామాను దగ్గర కావలి ఉన్న వాడికి ఒకటే భాగం కదా. అందరూ సమానంగానే పాలు పంచుకుంటారు గదా”
2 Samuel 17:8నీ తండ్రి, అతనితో ఉన్నవారు మహా బలమైన యుద్ధ వీరులు. అడవిలో తమ పిల్లలను పోగొట్టుకొన్న ఎలుగుబంటులను పోలినవారై రగిలిపోతూ ఉన్నారని నీకు తెలుసు. నీ తండ్రి యుద్ధవిద్యలో నేర్పరి. అదీకాక అతడు తన మనుషులతో కలసి బసచేయడు.