The Bible Software
bible.software › 1 సమూ › 1 సమూ 26 › 1 సమూ 26:6

1 సమూ 26:6

అప్పుడు దావీదు “శిబిరంలో ఉన్న సౌలు దగ్గరికి నాతో కలసి ఎవరు వస్తారు” అని హిత్తీయుడైన అహీమెలెకును సెరూయా కొడుకు, యోవాబు సోదరుడైన అబీషైని అడిగాడు. “నీతో నేను వస్తాను” అని అబీషై అన్నాడు.

బైబిల్ (తెలుగు)

In The King James Version

Then answered David and said to Ahimelech the Hittite, and to Abishai the son of Zeruiah, brother to Joab, saying, Who will go down with me to Saul to the camp? And Abishai said, I will go down with thee.

In Context

5తరువాత దావీదు లేచి సౌలు సైన్యం మకాం వేసిన స్థలానికి వచ్చి, సౌలు, సౌలు సైన్యాధిపతి, నేరు కొడుకు అబ్నేరు నిద్రపోతున్న స్థలం చూశాడు. సౌలు శిబిరం మధ్యలో నిద్ర పోతున్నప్పుడు సైనికులు అతని చుట్టూ పడుకున్నారు.

7దావీదు, అబీషైలు రాత్రి సమయంలో ఆ శిబిరం దగ్గరికి వెళితే సౌలు శిబిరం మధ్యలో పండుకుని నిద్రపోతున్నాడు. అతని ఈటె అతని దిండు పక్క నేలకు గుచ్చి ఉంది. అబ్నేరు, ఇతరులు సౌలు చుట్టూ పండుకుని నిద్రపోతున్నారు.

Read all of 1 సమూ 26

Cross References

Genesis 15:20హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయీయులను,

1 Samuel 14:6యోనాతాను “ఈ సున్నతి లేనివారి శిబిరంపైకి వెళ్దాం పద. ఒకవేళ యెహోవా మన కార్యాన్ని సఫలం చేస్తాడేమో. అనేకమంది చేతనైనా, కొద్దిమంది చేతనైనా రక్షించడం యెహోవాకు అసాధ్యమా?” అని తన ఆయుధాలు మోసేవాడితో అన్నాడు.

2 Samuel 2:18సెరూయా ముగ్గురు కొడుకులు యోవాబు, అబీషై, అశాహేలు అక్కడ ఉన్నారు. అశాహేలు అడవి లేడి లాగా వేగంగా పరిగెత్తగలడు.

2 Samuel 11:21ఎరుబ్బెషెతు కొడుకు అబీమెలెకు ఎలా చనిపోయాడు? తేబేసు దగ్గర ఒక స్త్రీ తిరగలి రాయిని గోడపై నుండి అతని మీద వేయడం వల్లనే గదా అతడు చనిపోయింది? ప్రాకారం దగ్గరికి మీరెందుకు వెళ్ళారు?’ అని అడిగితే, నువ్వు, ‘తమ సేవకుడైన ఊరియా కూడా చనిపోయాడు’ అని చెప్పు” అని చెప్పి ఆ సైనికుణ్ణి పంపాడు.

2 Samuel 12:9నీవు యెహోవా మాటను ధిక్కరించి ఆయన దృష్టికి చెడ్డ పని ఎందుకు చేశావు? హిత్తీయుడైన ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీ భార్యగా చేసుకోవడానికి కుట్ర పన్నావు. అమ్మోనీయుల చేత అతణ్ణి చంపించావు.

2 Samuel 18:5అప్పుడు రాజు యోవాబు, అబీషై, ఇత్తయిలను పిలిచి “నా కోసం యువకుడైన అబ్షాలోము పట్ల దయ చూపించండి” అని ఆజ్ఞాపించాడు. అక్కడున్నవారంతా వింటూ ఉండగానే రాజు అబ్షాలోమును గూర్చి సైన్యాధిపతులకందరికీ ఈ ఆజ్ఞ ఇచ్చాడు.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study 1 సమూ 26:6

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← 1 సమూ 26:51 సమూ 261 సమూ 26:7 →