2 Chronicles 13:11
వారు ప్రతి ఉదయం, సాయంకాలం యెహోవాకు దహనబలులు అర్పిస్తూ, సుగంధద్రవ్యాలతో ధూపం వేస్తూ, పవిత్రమైన బల్లమీద సన్నిధి రొట్టెలు ఉంచుతూ, బంగారు దీపస్తంభాన్ని, ప్రమిదలను ప్రతి సాయంత్రం వెలిగిస్తూ ఉన్నారు. మేము మా దేవుడు యెహోవా ఏర్పాటు చేసిన ఆజ్ఞల ప్రకారం సమస్తాన్నీ జరిగిస్తున్నాం. కానీ మీరు మాత్రం ఆయన్ని విడిచిపెట్టారు.”
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Genesis 26:5ఎందుకంటే నీ తండ్రి అబ్రాహాము నా మాటకు లోబడి నా ఆజ్ఞలనూ, శాసనాలనూ, నా చట్టాలనూ, నా నియమాలనూ పాటించాడు” అని అతనికి చెప్పాడు.
Exodus 27:20దీపం నిత్యం వెలుగుతుండేలా ప్రమిదలకు దంచి తీసిన స్వచ్ఛమైన ఒలీవల నూనె తేవాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు.
Exodus 30:1యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “ధూపం వేయడానికి తుమ్మకర్రతో మందసాన్ని తయారు చెయ్యాలి.
Leviticus 24:2“దీపం ఎప్పుడూ వెలుగుతూ ఉండేలా ప్రమిదల కోసం దంచి తీసిన స్వచ్ఛమైన ఒలీవ నూనె తేవాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు.
Numbers 1:53నా కోపం ఇశ్రాయేలు ప్రజలపైకి రాకుండా ఉండాలంటే లేవీయులు నిబంధన శాసనాల గుడారం చుట్టూ తమ నివాసాలు ఏర్పాటు చేసుకోవాలి. నిబంధన శాసనాల గుడారాన్ని వారే జాగ్రత్తగా చూసుకోవాలి.”
Numbers 16:6కోరహు, నువ్వూ నీ గుంపూ ఇలా చెయ్యండి, మీరు ధూపార్తులు తీసుకుని వాటిలో నిప్పు ఉంచి రేపు యెహోవా సన్నిధిలో వాటి మీద ధూపసాంబ్రాణి వెయ్యండి.