2 Chronicles 13:14
యూదా వారు, తమకు ముందూ వెనకా యోధులు ఉన్నట్టు తెలుసుకుని యెహోవాకు ప్రార్థన చేశారు, యాజకులు బూరలు ఊదారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Numbers 10:9మిమ్మల్ని బాధించే శత్రువుకి వ్యతిరేకంగా మీ దేశంలో యుద్ధానికి బయలు దేరే సమయంలో ఆ బాకాలు పదేపదే పెద్ద శబ్దంతో ఊదాలి. అప్పుడు మీ దేవుడైన యెహోవా అనే నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని శత్రువుల నుండి మిమ్మల్ని రక్షిస్తాను.
Judges 20:33ఇశ్రాయేలు సైనికులందరూ సిద్ధపడి బయల్తామారు అనే చోట యుద్ధం కోసం బారులు తీరారు. ఈ లోగా మాటున దాగి ఉన్న సైనికులు తాము దాగి ఉన్న స్థలం నుండి గిబియాకు పడమటి వైపునుండి వేగంగా వచ్చారు.
2 Samuel 10:9తనకు వెనకా, ముందూ యుద్ధపంక్తులుగా నిలబడి ఉన్న సైనికులను చూసి యోవాబు ఇశ్రాయేలీయుల్లో మహా వీరులైన కొందరిని ఎన్నుకుని వరుసలుగా నిలబెట్టి అరామీయులను ఎదుర్కోడానికి సిద్ధపడ్డాడు.
2 Chronicles 14:11ఆసా తన దేవుడు యెహోవాకు మొర్రపెట్టి “యెహోవా, మహా సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేనివారికి సహాయం చేయడానికి నీకన్నా ఇంకెవరూ లేరు. మా దేవా, యెహోవా, మాకు సహాయం చెయ్యి. నిన్నే నమ్ముకున్నాము. నీ నామాన్ని బట్టే ఈ గొప్ప సైన్యాన్ని ఎదిరించడానికి బయలుదేరాము. యెహోవా! నువ్వే మా దేవుడివి. మానవమాత్రులను నీ మీద జయం పొందనీయకు” అని ప్రార్థించాడు.
2 Chronicles 32:20రాజైన హిజ్కియా, ఆమోజు కొడుకూ, ప్రవక్తా అయిన యెషయా ఈ విషయం గురించి ప్రార్థించి ఆకాశం వైపు మొర్రపెట్టారు.
Psalms 91:5రాత్రిలో కలిగే భయభ్రాంతులకు, పగటివేళ ఎగిరి వచ్చే బాణాలకూ నువ్వు భయపడవు. 1