2 Chronicles 17:14
వీరి పూర్వీకుల వంశాల ప్రకారం వీరి సంఖ్య. యూదాలో సహస్రాధిపతులకు ప్రధాని అయిన అద్నా దగ్గర 3,00,000 మంది పరాక్రమశాలులున్నారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
13యూదాదేశపు పట్టణాల్లో అతనికి విస్తారమైన సంపద సమకూడింది. అతని కింద పరాక్రమశాలురు యెరూషలేములో ఉండేవారు.
15అతని తరువాత యెహోహానాను అనే అధిపతి. ఇతని దగ్గర 2, 80,000 మంది ఉన్నారు.
Cross References
Genesis 12:2నిన్ను ఒక గొప్ప జాతిగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ పేరును గొప్పచేస్తాను. నువ్వు దీవెనగా ఉంటావు.
Genesis 15:5ఆయన అతణ్ణి బయటకు తీసుకువచ్చి “నువ్వు ఆకాశం వైపు చూసి, ఆ నక్షత్రాలు లెక్కపెట్టడం నీకు చేతనైతే లెక్కపెట్టు” అని చెప్పి “నీ సంతానం కూడా అలా అవుతుంది” అని చెప్పాడు.
Numbers 1:18వీళ్ళతో పాటు ఇశ్రాయేలు ప్రజల్లో పురుషులందరినీ రెండో నెల మొదటి రోజున సమావేశపర్చారు. ఇరవై ఏళ్ళూ ఆ పై వయసున్న వారు తమ తమ వంశాలనూ, పూర్వీకుల కుటుంబాలనూ తమ తెగల పెద్దల పేర్లనూ తెలియజేసారు.
2 Chronicles 13:3అబీయాకు యరొబాముకు మధ్య యుద్ధం జరిగింది. అబీయా 4,00,000 మంది పరాక్రమశాలులైన సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేశాడు. యరొబాము కూడా 8,00,000 మంది పరాక్రమశాలులను అతనికి ఎదురుగా వ్యూహపరిచాడు.
2 Chronicles 26:13రాజుకు సహాయం చేయడానికి శత్రువులతో యుద్ధం చేయడంలో పేరు పొందిన పరాక్రమశాలురైన 3,07,500 మంది సైన్యం, వారి చేతి కింద ఉంది.