2 Chronicles 18:22
నీ ప్రవక్తలైన వీరి నోటిలో యెహోవా అబద్ధాలాడే ఆత్మను ఉంచాడు. యెహోవా నీకు కీడు నిర్ణయించాడు.”
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Exodus 4:21అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు “నీవు ఐగుప్తుకు చేరిన తరువాత చేయడానికి నేను నీకిచ్చిన అద్భుత కార్యాలు ఫరో సమక్షంలో చెయ్యాలి, అయితే నేను అతని హృదయం కఠినం చేస్తాను. అతడు ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనివ్వడు.
2 Chronicles 18:17అది విని ఇశ్రాయేలు రాజు యెహోషాపాతుతో ఇలా అన్నాడు. “ఇతడు నా విషయంలో కీడునే గాని మేలును ప్రవచించడని నేను నీతో చెప్పలేదా?”
2 Chronicles 25:18కాగా ఇశ్రాయేలు రాజు యెహోయాషు యూదారాజు అమజ్యాకు ఇలా తిరుగు సందేశం పంపాడు. “‘నీ కూతుర్ని నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చెయ్యి’ అని లెబానోనులో ఉన్న ముళ్ళ చెట్టు లెబానోనులో ఉన్న దేవదారు వృక్షానికి సందేశం పంపితే లెబానోనులో తిరిగే ఒక అడవి జంతువు ఆ ముళ్ళచెట్టును తొక్కివేసింది.
Isaiah 3:11దుష్టుడికి బాధ! అతనికి కీడు జరుగుతుంది. 1 అతని చేతి పనుల ఫలం అతడు పొందుతాడు. 1
Jeremiah 18:11కాబట్టి నువ్వు వెళ్లి యూదావారితో యెరూషలేము నివాసులతో ఇలా చెప్పు. “యెహోవా ఇలా చెబుతున్నాడు, మీ మీదికి విపత్తు రప్పించబోతున్నాను. మీకు విరోధంగా ఒక ఆలోచన చేస్తున్నాను. మీరంతా ఒక్కొక్కరు మీ దుర్మార్గాన్ని విడిచి మీ విధానాలనూ ప్రవర్తననూ మార్చుకోండి.” 1
Ezekiel 14:9ఒకవేళ ఎవరన్నా ఒక ప్రవక్త మోసపోయి ఒక సందేశం పలికితే యెహోవానైన నేను ఆ ప్రవక్తను మోసం చేస్తాను. అతనికి విరోధంగా నా చెయ్యి చాపి నా ప్రజలైన ఇశ్రాయేలు నుండి అతణ్ణి నాశనం చేస్తాను.