The Bible Software
bible.software2 Chronicles2 Chronicles 23 › 2 Chronicles 23:18

2 Chronicles 23:18

యెహోవా మందిరంలో దావీదు నియమించినట్టుగానే పనిచేసే వారిని బలులు అర్పించే వారిని లేవీయులైన యాజకుల పర్యవేక్షణలో యెహోయాదా నియమించాడు. వీరు మోషే ధర్మశాస్త్రంలో ఉన్నట్టే దావీదు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సంతోషంతో సంగీతాలతో సేవ జరిగించారు.

బైబిల్ (తెలుగు)

In The King James Version

Also Jehoiada appointed the offices of the house of the LORD by the hand of the priests the Levites, whom David had distributed in the house of the LORD, to offer the burnt offerings of the LORD, as it is written in the law of Moses, with rejoicing and with singing, as it was ordained by David.

In Context

17అప్పుడు ప్రజలంతా బయలు దేవుడి గుడికి వెళ్లి దాన్ని పడగొట్టారు. బయలు బలిపీఠాలను విగ్రహాలను ముక్కలు ముక్కలు చేసి, బయలు యాజకుడు మత్తానును బలిపీఠం ఎదుట చంపేశారు.

19యెహోవా మందిరంలో ఏ విధంగానైనా మైలబడిన వారు ప్రవేశించకుండా అతడు గుమ్మాల దగ్గర ద్వారపాలకులను ఉంచాడు.

Read all of 2 Chronicles 23

Cross References

Numbers 28:1యెహోవా మోషేతో మాట్లాడుతూ,

Numbers 28:28నూనెతో కలిపిన ఆరు కిలోల మెత్తని పిండిలో మూడు పదో వంతులు, ప్రతి పొట్టేలుతో రెండు పదో వంతులు,

1 Chronicles 23:4వాళ్ళల్లో ఇరవై నాలుగు వేలమంది యెహోవా మందిరం పని పర్యవేక్షించే వారుగా, ఆరు వేల మంది అధికారులుగా న్యాయం తీర్చేవారుగా ఉన్నారు.

1 Chronicles 25:1దావీదు, మందిరం పనుల కోసం ఏర్పరచిన అధిపతులూ కలిసి, ఆసాపు, హేమాను, యెదూతూను అనేవాళ్ళ కొడుకుల్లో కొందరిని సేవ నిమిత్తం ప్రత్యేకపరచి, సితారాలను, స్వరమండలాలను, కంచు తాళాలను వాయిస్తూ ప్రవచించేలా నియమించారు. ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పాటైన వాళ్ళ సంఖ్య ఎంతంటే,

2 Chronicles 7:6యాజకులు తమ తమ సేవా స్థలాల్లో నిలిచారు. లేవీయులు “యెహోవా కృప నిత్యమూ నిలుస్తుంది” అంటూ దేవుణ్ణి స్తుతించడానికి దావీదు ఏర్పాటు చేసిన యెహోవా గీతాలు పాడుతూ, వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు. యాజకులు వారికి ఎదురుగా నిలబడి బూరలు ఊదుతూ ఉంటే, ఇశ్రాయేలు ప్రజలంతా నిలబడి ఉన్నారు.

2 Chronicles 29:30దావీదూ, దీర్ఘ దర్శి ఆసాపూ, రాసిన పాటలు పాడి యెహోవాను స్తుతించమని రాజైన హిజ్కియా, అధికారులూ లేవీయులకు ఆజ్ఞాపిస్తే వారు ఆనందంతో స్తుతి గానం చేసి, తలవంచి ఆరాధించారు.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study 2 Chronicles 23:18

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← 2 Chronicles 23:172 Chronicles 232 Chronicles 23:19 →