2 Chronicles 23:2
వారు యూదా దేశమంతా తిరిగి యూదావారి పట్టణాలన్నిటిలో నుంచి లేవీయులనూ, ఇశ్రాయేలీయుల పూర్వీకుల కుటుంబ పెద్దలనూ సమకూర్చారు. వారంతా యెరూషలేముకు వచ్చారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
1 Chronicles 24:6లేవీయుల్లో శాస్త్రిగా ఉన్న నెతనేలు కొడుకు షెమయా, ఈ జాబితా రాశాడు. రాజు, అధికారులు, యాజకుడు సాదోకు, అబ్యాతారు కొడుకు అహీమెలెకు, యాజకులు, లేవీయులు, పూర్వీకుల ఇంటిపెద్దలు, వీళ్ళందరి సమక్షంలో వాళ్ళ పేర్లు రాశాడు. ఒక్కొక్క పాత్రలోనుంచి ఒక పూర్వీకుని వంశం చీటీ తీసినప్పుడు, ఒకటి ఎలియాజరు పేరట, తరువాత ఇంకొకటి ఈతామారు పేరట తీశారు.
2 Chronicles 21:2యెహోషాపాతు కుమారులైన అజర్యా, యెహీయేలు, జెకర్యా, అజర్యా, మిఖాయేలు, షెఫట్య అనేవారు ఇతనికి సోదరులు. వీరంతా ఇశ్రాయేలు రాజు యెహోషాపాతు కొడుకులు.
Matthew 10:16“తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను. కాబట్టి పాముల్లాగా వివేకంగా, పావురాల్లాగా కపటం లేకుండా ఉండండి.