2 Chronicles 30:11
అయినా, ఆషేరు మనష్షే, జెబూలూను గోత్రాల్లో కొంతమంది తమను తాము తగ్గించుకుని యెరూషలేము వచ్చారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Nevertheless divers of Asher and Manasseh and of Zebulun humbled themselves, and came to Jerusalem.
In Context
Cross References
Leviticus 26:41నేను వారికి విరోధంగా నడిచానని, తమ శత్రువుల దేశంలోకి తమ్మును రప్పించాననీ ఒప్పుకుంటే, అంటే లోబడని తమ హృదయాలు లొంగి తాము చేసిన దోషానికి ప్రతి దండన అనుభవించామని ఒప్పుకుంటే,
2 Chronicles 11:16ఇలా ఉండగా ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటిలో తమ దేవుడైన యెహోవాను వెదకడానికి తమ మనస్సులో నిర్ణయించుకున్నవారు కొందరు ఉన్నారు. వారు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాకు బలులర్పించడానికి యెరూషలేముకు వచ్చారు.
2 Chronicles 12:12అతడు తనను తాను తగ్గించుకోవడం వలన, యూదావారిలో కొంతమట్టుకు మంచి ఇంకా మిగిలే ఉండడం వలన, యెహోవా అతనిని పూర్తిగా నశింపజేయకుండా తన కోపాన్ని అతని మీద నుండి మళ్లించుకున్నాడు.
2 Chronicles 30:21యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలువారు ఏడు రోజులు తను పరిశుద్ధ పరచుకోకుండా ఉండిపోయిన వారు అనేకమంది ఉన్నారు. అలా పరిశుద్ధ పరచుకొనని వారి కోసం పస్కా పశువులను లేవీయులు వధించాల్సి వచ్చింది. ఏడూ రోజులపాటు రొట్టెల పండగను చాలా ఆనందంగా ఆచరించారు. లేవీయులూ, యాజకులూ సంగీత వాద్యాలతో పాటలు పాడుతూ ప్రతిరోజూ యెహోవాను స్తుతించారు.
2 Chronicles 33:12బాధతో అతడు తన దేవుడైన యెహోవాను బతిమాలి, తన పూర్వీకుల దేవుని సన్నిధిలో తన్ను తాను ఎంతో తగ్గించుకున్నాడు.
2 Chronicles 33:23తన తండ్రియైన మనష్షేలాగా యెహోవా సన్నిధిలో తనను తాను తగ్గించుకోలేదు. దానికి బదులు ఇంకా ఎక్కువ పాపం చేశాడు.