2 Chronicles 30:19
“పరిశుద్ధమందిర శుద్ధీకరణ ప్రమాణాల ప్రకారం అశుద్ధంగా ఉన్నవారు, తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను వెదకడానికి తమ హృదయాన్ని సిద్ధపరచుకుంటే, అలాటి వారినందరినీ దయ గల యెహోవా క్షమించును గాక.”
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
20యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి ప్రజలను బాగుచేశాడు.
Cross References
Leviticus 15:31నేను ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసిస్తున్నాను. తమ అశుద్ధతతో వాళ్ళు నా నివాస స్థలాన్ని పాడు చేయకూడదు. వాళ్ళు తమ అశుద్ధతతో నా నివాస స్థలాన్ని పాడు చేసి చనిపోకుండా మీరు వారి అశుద్ధతని వాళ్ళకి దూరం చేయాలి.
Leviticus 22:3నీవు వారితో ఇలా చెప్పు. మీ తరతరాలకు మీ సంతతి వారందరిలో ఒకడు అపవిత్రంగా ఉండి ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించే వాటిని సమీపిస్తే అలాంటి వాణ్ణి నా సన్నిధిలో ఉండకుండాా దూరంగా కొట్టివేస్తాను. నేను యెహోవాను.
Numbers 19:13మనిషి శవాన్ని ముట్టుకున్నవాడు ఆ విధంగా పాపశుద్ధి చేసుకోకపోతే అతడు యెహోవా మందిరాన్ని అపవిత్రం చేసినవాడౌతాడు. పాపపరిహార జలం అతని మీద చల్ల లేదు గనక ఆ వ్యక్తిని ఇశ్రాయేలీయుల్లో లేకుండా చెయ్యాలి. అతడు అశుద్ధుడుగానే ఉండిపోతాడు. అతని అశుద్ధత అతని మీద ఉంటుంది.
1 Chronicles 29:18అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు అనే మా పూర్వీకుల దేవా యెహోవా, నీ ప్రజలు హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశాన్ని నిత్యం కాపాడు. వాళ్ళ హృదయం నీకు అనుకూలంగా ఉండేలా చెయ్యి.
2 Chronicles 20:33అయితే అప్పటికి ఇంకా ప్రజలు తమ పూర్వీకుల దేవుణ్ణి అనుసరించడానికి తమ హృదయాల్లో నిశ్చయం చేసుకోలేదు, అతడు అన్య దైవ మందిరాలను తీసివేయలేదు.
Ezra 7:10ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించి దాని ప్రకారం నడుచుకోవాలని, ఇశ్రాయేలీయులకు దాని చట్టాలను, ఆజ్ఞలను నేర్పాలని స్థిరంగా నిశ్చయం చేసుకున్నాడు. 1 ఎజ్రాకు అర్తహషస్త రాజు పంపిన ఉత్తరం