2 Chronicles 30:8
మీ పూర్వికుల్లాగా మీరు అవిధేయులుగ ప్రవర్తించ కండి. యెహోవాకు లోబడి, ఆయన శాశ్వతంగా పరిశుద్ధ పరచిన ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి, మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీది నుంచి తొలగి పోయేలా ఆయన్ని సేవించండి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Deuteronomy 6:13మీ యెహోవా దేవునికే భయపడాలి, ఆయననే పూజించాలి, ఆయన పేరట మాత్రమే ప్రమాణం చేయాలి.
Deuteronomy 10:16కాబట్టి మీరు మూర్ఖంగా ప్రవర్తించకుండా సున్నతి లేని మీ హృదయాలకు సున్నతి చేసుకోండి.
2 Kings 23:26అయినా, మనష్షే యెహోవాకు పుట్టించిన కోపం వల్ల ఆయన కోపాగ్ని ఇంకా చల్లారకుండా, యూదా మీద మండుతూనే ఉంది.
2 Chronicles 6:5ఆయన ‘నేను నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన రోజు మొదలు నా నామం నిలిచి ఉండడానికి ఒక మందిరం కట్టించాలని నేను ఇశ్రాయేలు గోత్రాల్లో ఏ పట్టణాన్నీ ఏర్పాటు చేసుకోలేదు, ఇశ్రాయేలీయులనే నా ప్రజల మీద అధిపతిగా ఉండడానికి ఏ మనిషినీ నియమించ లేదు.
2 Chronicles 7:16నా పేరు ఈ మందిరానికి నిత్యమూ ఉండేలా నేను దాన్ని కోరుకుని పరిశుద్ధపరిచాను. నా కనులు, నా మనస్సు నిత్యం దాని మీద ఉంటాయి.
2 Chronicles 28:13“యెహోవా మన మీదికి అపరాధ శిక్ష రప్పించేలా మీరు చేశారు. బందీలుగా పట్టుకున్న వీరిని మీరు ఇక్కడికి రప్పించ వద్దు. మన పాపాలను, అపరాధాలను ఇంకా ఎక్కువ చేసుకోడానికి మీరు చూస్తున్నట్టుంది. ఇప్పటికే మనం ఎంతో పాపం చేశాము. ఇశ్రాయేలు మీద యెహోవా, తీవ్రమైన కోపంతో ఉన్నాడు.”