2 Chronicles 34:4
అతడు చూస్తుండగానే ప్రజలు బయలు దేవుడి బలిపీఠాలను పడగొట్టారు. వాటిపైన ఉన్న ధూప వేదికలను నరికివేశారు. అషేరా దేవత స్తంభాలనూ, చెక్కిన విగ్రహాలనూ, పోతవిగ్రహాలనూ పగలగొట్టి పొడి చేసేశారు. వాటికి బలులు అర్పించిన వారి సమాధుల మీద ఆ పొడి చల్లారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
5ఆ పూజారుల ఎముకలను వాళ్ళ బలిపీఠాల మీద అతడు కాల్పించి, యూదానూ యెరూషలేమునూ శుద్ధి చేశాడు.
Cross References
Exodus 23:24మీరు వారి దేవుళ్ళ ఎదుట సాష్టాంగపడ కూడదు, వారికి మొక్క కూడదు. వాళ్ళు చేసే పనులు చేయ కూడదు. వాళ్ళ విగ్రహాలను తుత్తునియలు చేసి + 23:24 ఆ దేవుళ్ళను.వాటిని పూర్తిగా నాశనం చెయ్యాలి.
Leviticus 26:30నేను మీ ఉన్నత స్థలాలను పాడు చేస్తాను. మీ విగ్రహాలను ధ్వంసం చేస్తాను. మీ విగ్రహాల శవాలపై మీ శవాలను పడవేయిస్తాను. నా మనస్సులో మిమ్మల్ని అసహ్యించు కుంటాను.
Deuteronomy 7:25వారి దేవతా ప్రతిమలను మీరు అగ్నితో కాల్చివేయాలి. వాటి మీద ఉన్న వెండి బంగారాల మీద ఆశ పెట్టుకోకూడదు. మీరు దాని ఉచ్చులో పడతారేమో. అందుకే వాటిని మీరు తీసుకోకూడదు. ఎందుకంటే అది మీ యెహోవా దేవునికి అసహ్యం.
1 Kings 13:2ఆ దైవ సేవకుడు యెహోవా ఆజ్ఞ ప్రకారం బలిపీఠానికి వ్యతిరేకంగా ఇలా ప్రకటన చేశాడు. “బలిపీఠమా! బలిపీఠమా! యెహోవా చెప్పేదేమిటంటే, దావీదు సంతానంలో యోషీయా అనే పేరుతో ఒక మగ బిడ్డ పుడతాడు. నీ మీద ధూపం వేసిన ఉన్నత పూజా స్థలాల యాజకులను అతడు నీ మీద వధిస్తాడు. అతడు మనిషి ఎముకలను నీ మీద కాలుస్తాడు.”
2 Kings 23:4రాజు బయలు దేవుడికీ, అషేరా దేవికీ, నక్షత్రాలకూ తయారు చేసిన వస్తువులన్నీ యెహోవా ఆలయంలోనుంచి బయటకు తీసుకు రావాలని ప్రధానయాజకుడు హిల్కీయాకు, రెండో వరుస యాజకులకు, ద్వారపాలకులకు ఆజ్ఞ ఇచ్చాడు. హిల్కీయా వాటిని యెరూషలేము బయట కిద్రోను పొలంలో తగలబెట్టి, ఆ బూడిద బేతేలు ఊరికి పంపేశాడు.
2 Kings 23:11ఇదే కాకుండా, అతడు యూదా రాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రాలను మంటపంలో నివసించే పరిచారకుడైన నెతన్మెలకు గది దగ్గర, యెహోవా మందిరపు ద్వారం దగ్గర నుంచి వాటిని తీసివేసి, సూర్యునికి ప్రతిష్ఠించిన రథాలను అగ్నితో కాల్చేశాడు.