2 రాజులు 20:5
“నీవు మళ్ళీ నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా దగ్గరికి వెళ్లి, అతనితో ఇలా చెప్పు. నీ పితరుడు దావీదుకు దేవుడైన యెహోవా నీకు చెప్పేదేమంటే, నీవు కన్నీళ్లు విడవడం చూశాను. నేను నీ ప్రార్థన అంగీకరించాను. నేను నిన్ను బాగు చేస్తాను. మూడో రోజు నీవు యెహోవా మందిరానికి ఎక్కి వెళ్తావు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
4యెషయా మధ్య ప్రాంగణంలోనుంచి అవతలకు వెళ్లకముందే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై,
Cross References
Exodus 3:9నిజంగా ఇశ్రాయేలు ప్రజల మొర నేను విన్నాను. ఐగుప్తీయులు వారి పట్ల జరిగిస్తున్న హింసాకాండను చూశాను.
Deuteronomy 32:39చూడండి. నేనే, నేను మాత్రమే దేవుణ్ణి. 1 నేను తప్ప మరో దేవుడు లేడు. 1 చంపేది నేనే, బతికించేది నేనే. 1 దెబ్బ కొట్టేది నేనే, బాగు చేసేది నేనే. 1 నా చేతిలో నుంచి విడిపించేవాడెవడూ లేడు. 1
1 Samuel 9:16ఎందుకంటే “నా ప్రజల విన్నపం నాకు చేరింది. నేను వారిని పట్టించుకొంటున్నాను. కాబట్టి ఫిలిష్తీయుల చేతిలోనుండి నా ప్రజలను విడిపించడానికి నా ప్రజలైన ఇశ్రాయేలీయులపై అతణ్ణి రాజుగా అభిషేకించడానికి రేపు ఇదే సమయానికి నేను బెన్యామీను దేశంలో నుండి ఒక వ్యక్తిని నీ దగ్గరికి రప్పిస్తాను.”
2 Samuel 5:2గతంలో సౌలు మాపై రాజుగా ఉన్నప్పుడు నువ్వు మా సంరక్షకుడుగా ఉన్నావు. ‘నువ్వు నా ప్రజలైన ఇశ్రాయేలీయులను పాలించి వారికి కాపరిగా ఉంటావు’ అని నిన్ను గురించి యెహోవా చెప్పాడు.”
1 Kings 9:3యెహోవా అతనితో ఇలా అన్నాడు. “నా సన్నిధిలో నీవు చేసిన ప్రార్థన విన్నపాలను నేను విన్నాను. నా నామం అక్కడ ఎప్పటికీ నిలిచి ఉండాలని నీవు కట్టించిన ఈ మందిరాన్ని నేను పవిత్ర పరిచాను. నా కళ్ళు, నా మనసు, ఎప్పటికీ దానివైపు ఉంటాయి.
2 Kings 20:7తరువాత యెషయా “అంజూరపుపళ్ళ ముద్ద తెప్పించండి” అని చెప్పాడు. వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగు పడ్డాడు.