2 Kings 24:13
ఇంకా అతడు యెహోవా మందిరపు ధననిధిలో ఉన్న వస్తువులు, రాజు ఖజానాలో ఉన్న సొమ్ము పట్టుకుని ఇశ్రాయేలు రాజు సొలొమోను యెహోవా ఆలయానికి చేయించిన బంగారపు ఉపకరణాలన్నీ, యెహోవా చెప్పిన విధంగా ముక్కలుగా చేయించి తీసుకెళ్ళిపోయాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
2 Kings 20:17రానున్న రోజుల్లో ఏమీ మిగులకుండా నీ రాజనగరులో ఉన్నవన్నీ, ఈ రోజు వరకూ నీ పూర్వికులు సమకూర్చి దాచిపెట్టినదంతా, వారు బబులోను పట్టణానికి తీసుకుని వెళ్ళిపోతారని యెహోవా చెప్తున్నాడు.
2 Chronicles 4:7అతడు తనకు అందిన నమూనా సూచనల ప్రకారం పది బంగారు దీపస్తంభాలను చేయించి, దేవాలయంలో కుడివైపు ఐదు, ఎడమవైపు ఐదు నిలబెట్టాడు.
Isaiah 39:6రాబోయే రోజుల్లో ఏమీ మిగలకుండా నీ ఇంటిలో ఉన్న సమస్తాన్నీ, ఈ రోజువరకూ నీ పూర్వికులు పోగుచేసి దాచిపెట్టినదంతా బబులోను పట్టణానికి దోచుకుపోతారని సేనల అధిపతి అయిన యెహోవా సెలవిస్తున్నాడు.
Jeremiah 27:16యాజకులతో ప్రజలందరితో నేను ఈ మాటలు చెప్పాను. “యెహోవా చెప్పేదేమిటంటే, ‘యెహోవా మందిరపు పాత్రలను ఇప్పుడే త్వరగా బబులోను నుంచి మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది.’ అని ప్రవచించే మీ ప్రవక్తలు మీతో అబద్ధాలు చెబుతున్నారు.
Jeremiah 28:6“యెహోవా దీనిని చేస్తాడు గాక! యెహోవా మందిరపు పాత్రలన్నీ బందీలుగా తీసుకుపోయిన వారందరినీ యెహోవా బబులోనులో నుంచి ఈ స్థలానికి తెప్పించి నువ్వు ప్రకటించిన మాటలను నెరవేరుస్తాడు గాక!
Daniel 5:2బెల్షస్సరు ద్రాక్షమద్యం సేవిస్తూ తన తండ్రి నెబుకద్నెజరు + 5:2 తన తండ్రి నెబుకద్నెజరు తండ్రి అన్న మాటను పూర్వీకుడు అనే అర్ధంలో వాడారు తప్ప నిజమైన తండ్రి కాదు. యెరూషలేమును కొల్లగొట్టి దేవాలయంలో నుండి తెచ్చిన బంగారు, వెండి పాత్రలను తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. అతడు, అతని అధికారులు, రాణులు, ఉపపత్నులు వాటిలో ద్రాక్ష మద్యం సేవించాలన్నది అతడి ఉద్దేశం.