2 రాజులు 4:12
అప్పుడు ఎలీషా తన సేవకుడు గేహజీని పిలిచి “ఆ షూనేమీ స్త్రీని పిలువు” అన్నాడు. అతడు ఆమెను పిలుచుకు వచ్చాడు. ఆమె వచ్చి అతని ముందు నిలబడింది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
11కాబట్టి తరువాత ఎలీషా ఆ గదిలో ఉండి విశ్రాంతి తీసుకునే రోజు వచ్చింది.
Cross References
1 Kings 18:43తరువాత అతడు తన సేవకుణ్ణి పిలిచి “నీవు పైకి వెళ్లి సముద్రం వైపు చూడు” అన్నాడు. వాడు మెరక ఎక్కి చూసి “ఏమీ కనబడ్డం లేదు” అన్నాడు. అతడు ఇంకా ఏడు సార్లు “వెళ్లి చూడు” అన్నాడు.
2 Kings 3:11కానీ యెహోషాపాతు “మన కోసం యెహోవాను సంప్రదించడానికి ఇక్కడ ఒక్క యెహోవా ప్రవక్త కూడా లేడా?” అని అడిగాడు. అప్పుడు ఇశ్రాయేలు రాజు దగ్గర సైనికోద్యోగి ఒకడు “షాపాతు కొడుకు ఎలీషా ఇక్కడ ఉన్నాడు. అతడు ఇంతకు ముందు ఎలీయా చేతులపై నీళ్ళు పోసే వాడు” అని చెప్పాడు.
2 Kings 5:20అతడు అక్కడ నుండి కొద్ది దూరం వెళ్ళాక దేవుని మనిషి ఎలీషా సేవకుడైన గేహజీ ఇలా అనుకున్నాడు. “చూశావా, ఈ సిరియా వాడైన నయమాను తెచ్చిన కానుకలను తీసుకోకుండా నా యజమాని అతణ్ణి వదిలేశాడు. యెహోవా మీద ఒట్టు, నేనిప్పుడు పరుగెత్తుకుంటూ వెళ్ళి అతని దగ్గర ఏదైనా తీసుకుంటాను.”
Acts 13:5వారు సలమీ అనే ఊరికి చేరుకుని యూదుల సమాజ మందిరాల్లో దేవుని వాక్కు ప్రకటించారు. మార్కు అనే యోహాను వారికి సహాయంగా ఉన్నాడు.