2 రాజులు 6:1
తరువాత ప్రవక్తల సమాజం వారు ఎలీషా దగ్గరికి వచ్చారు. వారు ఎలీషాతో “మేము నీతో ఉంటున్న ఈ స్థలం చాలా ఇరుకుగా ఉంది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Joshua 17:14అప్పుడు యోసేపు వంశంవారు యెహోషువతో “మాకు ఒక్క చీటితో ఒక్క వంతే స్వాస్థ్యంగా ఇచ్చావేంటి? మేము గొప్ప జనం గదా? ఇంతవరకూ యెహోవా మమ్మల్ని దీవించాడు” అని మనవి చేశారు.
1 Samuel 19:20దావీదును పట్టుకోవడానికి సౌలు తన సైనికులను పంపించాడు. వీరు అక్కడికి వచ్చినప్పుడు కొందరు ప్రవక్తలు సమకూడి పూనకంలో ప్రకటించడం, సమూయేలు వారికి నాయకుడుగా ఉండడం చూసినప్పుడు దేవుని ఆత్మ సౌలు పంపిన సైనికుల మీదకి వచ్చాడు. వారు కూడా పరవశులై ప్రకటించడం ప్రారంభించారు.
2 Kings 2:3బేతేలులో ఉన్న ప్రవక్తల సమాజం వారు ఎలీషా దగ్గరికి వచ్చారు. “ఈ రోజు నీ దగ్గరనుండి నీ గురువుని యెహోవా తీసుకు వెళ్తాడని తెలుసా?” అని ఎలీషాను ప్రశ్నించారు. దానికి ఎలీషా “నాకు తెలుసులే. మీరు దాని గురించి మాట్లాడకండి” అని జవాబిచ్చాడు.
2 Kings 2:7తరువాత వాళ్ళిద్దరూ యొర్దాను నదీ తీరాన నిల్చున్నారు. ప్రవక్తల సమాజం వారు యాభై మంది కొంచెం దూరంలో నిలబడి చూస్తూ ఉన్నారు.
2 Kings 4:1ఆ తరువాత ప్రవక్తల సమాజంలో ఒకడి భార్య ఏడ్చుకుంటూ ఎలీషా దగ్గరికి వచ్చింది. “నీ సేవకుడైన నా భర్త చనిపోయాడు. అతనికి యెహోవాపై భయమూ, భక్తీ ఉన్నాయని నీకు తెలుసు. ఇప్పుడు మాకు అప్పు ఇచ్చిన వాడు నా ఇద్దరు కొడుకులనూ తనకు బానిసలుగా తీసుకు వెళ్ళడానికి వచ్చాడు” అని చెప్పింది.
Job 36:16అంతేగాక బాధలోనుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. కష్టం లేని విశాల స్థలానికి నిన్ను తోడుకుపోతాడు. నీ భోజనం బల్లపై ఉన్న ఆహారాన్ని కొవ్వుతో నింపుతాడు. 1