2 Peter 3:4
“ఆయన మళ్ళీ వస్తాడన్న వాగ్దానం ఏమయ్యింది? మా పూర్వీకులు చనిపోయారు, కాని సృష్టి ఆరంభం నుండి అన్ని విషయాలూ ఏమీ మార్పు లేకుండానే జరిగిపోతున్నాయి” అంటూ మిమ్మల్ని ఎగతాళి చేస్తారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
3ముందుగా ఇది తెలుసుకోండి, చివరి రోజుల్లో తమ దురాశలను అనుసరించి నడిచే కొందరు బయలుదేరతారు.
5చాలాకాలం కిందట, ఆకాశాన్నీ భూమినీ దేవుడు తన వాక్కు ద్వారా నీళ్ళలో నుండి, నీళ్ళ ద్వారా స్థిరపరిచాడనీ,
Cross References
Genesis 19:14అప్పుడు లోతు బయటకు వెళ్ళి తన కూతుళ్ళను పెళ్లి చేసుకోబోతున్న తన అల్లుళ్ళతో మాట్లాడాడు. “త్వరగా రండి. ఇక్కడినుండి బయట పడాలి. యెహోవా ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు” అని చెప్పాడు. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి హాస్యమాడుతున్నవాడిలా కనిపించాడు.
Ecclesiastes 8:11చెడు పనికి తగిన శిక్ష వెంటనే కలగకపోవడం చూసి మనుషులు భయం లేకుండా చెడ్డ పనులు చేస్తారు.
Jeremiah 5:12వారు నన్ను తోసిపుచ్చి “యెహోవా నిజమైనవాడు కాదు. మనపైకి ఏ కీడు గానీ ఖడ్గం గానీ కరువు గానీ రాదు. 1
Ezekiel 11:3వాళ్ళిలా అంటున్నారు, ‘ఇల్లు కట్టడానికి ఇది సమయం కాదు. ఈ పట్టణం పాత్ర అయితే మనం దానిలో ఆహారం’
Malachi 2:17మీరు మీ మాటలతో యెహోవాకు చిరాకు కలిగించారు. “ఏ విధంగా ఆయనకు చిరాకు కలిగించాం?” అని మీరు అడుగుతున్నారు. “చెడ్డ పనులు చేసే వాళ్ళంతా యెహోవా దృష్టిలో మంచివారే. వారిపట్ల ఆయన ఆనందిస్తాడు. లేకపోతే న్యాయం చేసే దేవుడు ఇక ఎందుకు?” అని చెప్పుకోవడం ద్వారా మీరు ఆయనకు చిరాకు కలిగిస్తున్నారు.
Matthew 24:48కానీ ఆ దాసుడు చెడ్డవాడైతే, ‘నా యజమాని ఆలస్యంగా వస్తాడులే’ అని తన మనసులో అనుకుని