2 సమూ 18:20
యోవాబు “ఈ రోజున ఈ కబురు చెప్పకూడదు. మరో రోజు చెప్పవచ్చు. ఎందుకంటే రాజు కుమారుడు చనిపోయాడు కనుక నేడు ఈ కబురు రాజుకు చెప్పడం భావ్యం కాదు” అని అతనితో చెప్పాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
2 Samuel 17:16“మీరు తొందరగా వెళ్లి, రాజు, అతని దగ్గర ఉన్న మనుషులంతా హతం కాకుండా ఉండేలా దావీదుకు ఈ విషయం చెప్పండి. మీరు ఈ రాత్రి అరణ్యంలో నది తీరం దాటే స్థలాల్లో ఉండవద్దు” అని చెప్పాడు.
2 Samuel 18:27కాపలా కాసేవాడు దగ్గరికి వస్తున్న మొదటివాణ్ణి చూసి “వాడు సాదోకు కొడుకు అహిమయస్సు అని నాకు అనిపిస్తుంది” అన్నాడు. అప్పుడు రాజు “వాడు మంచివాడు, మంచివార్తే తెచ్చి ఉంటాడు” అన్నాడు.
2 Samuel 18:33అప్పుడు రాజు తీవ్రంగా పరితాపం చెందాడు. పట్టణం గుమ్మానికి పైన ఉన్న గదికి వెళ్లి, ఏడుస్తూ అటూ ఇటూ తిరుగుతూ “అబ్షాలోమా, నా బిడ్డా, అబ్షాలోమా” అని కేకలు వేస్తూ “అయ్యో నా బిడ్డా, నీ బదులు నేను చనిపోయినా బాగుండేది. నా బిడ్డా, అబ్షాలోమా, నా బిడ్డా” అని విలపిస్తూ ఉన్నాడు.