2 సమూ 19:18
వారంతా రాజు ఎదురుగా నది దాటారు. రాజు, అతని పరివారం నది దాటడానికి, రాజుకు అనుకూలంగా చేయడానికి పడవను ఇవతలకు తెచ్చి పెట్టారు. రాజు యొర్దాను నది దాటి వెళ్ళగానే గెరా కుమారుడు షిమీ వచ్చి అతనికి సాష్టాంగపడ్డాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
2 Samuel 9:10కాబట్టి నువ్వు, నీ కొడుకులు, దాసులు అతని కోసం ఆ భూమిని సాగు చెయ్యండి. నీ యజమాని కొడుకు తినేందుకు సరిపోయిన ఆహారం ఆ పంట నుండి తీసుకు రావాలి. నీ యజమాని కుమారుడు మెఫీబోషెతు ఎప్పుడూ నా బల్ల దగ్గరే భోజనం చేస్తాడు” అని చెప్పాడు. సీబాకు పదిహేనుమంది కొడుకులు, ఇరవైమంది సేవకులు ఉన్నారు.
Psalms 66:3నీ కార్యాలు ఎంతో భీకరమైనవి. నీ మహా శక్తిని బట్టి నీ శత్రువులు నీకు లోబడతారు. 1
Revelation 3:9సాతాను సమాజానికి చెందినవారై ఉండి, మేము యూదులమే అని అబద్ధమాడే వారిని రప్పిస్తాను. వారు వచ్చి నీ కాళ్ళపై పడి నీకు నమస్కారం చేస్తారు. నేను నిన్ను ప్రేమించానని వారికి అర్థం అయ్యేలా చేస్తాను.