2 సమూ 19:24
సౌలు మనవడు మెఫీబోషెతు రాజును కలుసుకోవడానికి వచ్చాడు. రాజు పారిపోయిన రోజునుండి అతడు క్షేమంగా తిరిగి వచ్చేంత వరకూ అతడు కాళ్లు కడుక్కోలేదు, గడ్డం కత్తిరించుకోలేదు, బట్టలు కూడా ఉతుక్కోలేదు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
23“నీకు మరణశిక్ష విధించను” అని షిమీకి వాగ్దానం చేశాడు.
25అతడు యెరూషలేములో రాజును కలిసినప్పుడు రాజు “మెఫీబోషెతూ, నీవు నాతో కలసి ఎందుకు రాలేదు?” అని అడిగాడు.
Cross References
2 Samuel 15:30దావీదు తన తల కప్పుకుని, ఏడుస్తూ, చెప్పులు లేకుండా నడుచుకొంటూ ఒలీవ చెట్ల కొండ ఎక్కుతూ వెళ్ళాడు. అతనితో ఉన్నవారంతా తలలు కప్పుకుని ఏడుస్తూ కొండ ఎక్కారు.
1 Kings 2:8ఇంకా బెన్యామీనీయుడు, గెరా కొడుకు, బహూరీము ఊరివాడు షిమీ నీ దగ్గర ఉన్నాడు. నేను మహనయీముకు వెళ్తుండగా అతడు నన్ను ఘోరంగా దూషించాడు. నన్ను ఎదుర్కోడానికి అతడు యొర్దాను నది దగ్గరికి దిగి వచ్చినప్పుడు, ‘యెహోవా జీవం తోడు, కత్తితో నేను నిన్ను చంపను’ అని ప్రమాణం చేశాను.
Jeremiah 41:5గడ్డాలు గీయించుకుని, బట్టలు చింపుకుని, శరీరాలు గాయపరచుకున్న 80 మంది పురుషులు యెహోవా మందిరానికి తీసుకెళ్ళడానికి నైవేద్యాలు, ధూపద్రవ్యాలు చేతపట్టుకుని షెకెము నుంచి, షిలోహు నుంచి, షోమ్రోను నుంచి వచ్చారు.
Romans 12:15సంతోషించే వారితో కలిసి సంతోషించండి. దుఖపడే వారితో కలిసి దుఖపడండి.