2 Samuel 19:39
అప్పుడు రాజు, ప్రజలందరూ నది అవతలకు వచ్చారు. రాజు బర్జిల్లయిని ముద్దు పెట్టుకుని దీవించాడు. తరువాత బర్జిల్లయి తన స్వస్థలానికి వెళ్ళిపోయాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Genesis 28:3సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి, నువ్వు అనేక జాతులయ్యేలా నీకు సంతానాభివృద్ధి కలిగించి, నిన్ను విస్తరింపజేసి నువ్వు పరవాసిగా ఉన్న దేశాన్ని, అంటే దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన దేశాన్ని నువ్వు వారసత్వంగా పొందేలా
Genesis 45:15అతడు తన సోదరులందరిని ముద్దు పెట్టుకుని వారిని హత్తుకుని ఏడ్చిన తరువాత అతని సోదరులు అతనితో మాట్లాడారు.
Genesis 47:10ఫరోను దీవించి వెళ్ళిపోయాడు.
Ruth 1:14వాళ్ళు మళ్ళీ గట్టిగా ఏడ్చారు. అప్పుడు ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకుంది, రూతు ఆమెను అంటి పెట్టుకునే ఉంది.
2 Samuel 6:18హోమబలులు, శాంతిబలులు అర్పించడం ముగిసిన తరువాత దావీదు సైన్యాలకు అధిపతి అయిన యెహోవా పేరట ప్రజలను ఆశీర్వదించాడు.
2 Samuel 13:25అప్పుడు రాజు “నా కుమారా, మమ్మల్ని పిలవొద్దు. మేము రాకూడదు. మేమంతా వస్తే అదనపు భారంగా ఉంటాం” అని చెప్పాడు. రాజు అలా చెప్పినప్పటికీ అబ్షాలోము తప్పకుండా రావాలని రాజును బలవంతపెట్టాడు.