2 Samuel 8:3
సోబా రాజు రెహోబు కుమారుడు హదదెజరు ఫరాతు నది దాకా తన రాజ్యాన్ని వ్యాపింపజేయాలని బయలు దేరాడు. దావీదు అతణ్ణి ఓడించి
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Genesis 15:18ఆ రోజున యెహోవా “ఐగుప్తు నది నుంచి, పేరుగాంచిన యూఫ్రటీసు నది వరకూ ఉన్న ఈ ప్రదేశాన్ని నీ వారసులకు ఇస్తాను.
Deuteronomy 11:24మీరు అడుగుపెట్టే ప్రతి స్థలం మీదవుతుంది. ఎడారి నుండి లెబానోను వరకూ, యూఫ్రటీసు నది నుండి పడమటి సముద్రం వరకూ మీ సరిహద్దుగా ఉంటుంది.
2 Samuel 10:6అమ్మోనీయులు, దావీదు విషయంలో తాము అతనికి అసహ్యులం అయ్యామని గ్రహించారు. వారు దావీదుకు భయపడి, తమ మనుషులను పంపి, బేత్రెహోబులో, అరాము సోబాలో ఉన్న అరామీయ సైన్యంలో నుండి ఇరవై వేలమంది సైనికులను జీతానికి మాట్లాడుకున్నారు. మయకా రాజు దగ్గరనుండి వెయ్యిమంది సైనికులను, టోబులో నుండి పన్నెండు వేలమంది సైనికులను జీతమిచ్చి పిలిపించుకున్నారు.
2 Samuel 10:19హదదెజరు సామంతులంతా తాము ఇశ్రాయేలీయుల ముందు నిలవలేక ఓడిపోవడం చూసి భయకంపితులయ్యారు. వారంతా ఇకపై అమ్మోనీయులకు సహాయం చేయడం మానుకుని ఇశ్రాయేలీయులకు లోబడి వారితో సంధి చేసుకున్నారు.
1 Kings 4:21నది (యూఫ్రటీసు) మొదలుకుని ఐగుప్తు సరిహద్దు వరకూ ఆ మధ్యలో ఉన్న రాజ్యాలన్నిటి మీదా ఫిలిష్తీయుల దేశమంతటి మీదా సొలొమోను అధికారం ఉంది. సొలొమోను బతికిన కాలమంతా ఆ ప్రజలు అతనికి పన్ను చెల్లిస్తూ, అణిగిమణిగి ఉన్నారు. 1 సొలొమోను గృహ భోజన సామగ్రి
1 Kings 11:24దావీదు సోబా వారిని చంపిన తరువాత రెజోను కొందరిని పోగు చేసుకుని, ఆ గుంపుకు నాయకుడయ్యాడు. వారంతా దమస్కు వచ్చి అక్కడ నివసించారు. రెజోను దమస్కులో రాజయ్యాడు.