bible.software › 2 Samuel › 2 Samuel 9 › 2 Samuel 9:11
2 Samuel 9:11
అప్పుడు సీబా “నా యజమానివైన రాజా, నీ దాసుణ్ణి నాకు సెలవిచ్చినట్టు అంతా జరిగిస్తాను” అని రాజుతో చెప్పాడు. అప్పటి నుండి మెఫీబోషెతు రాజకుమారుల్లో ఒకడు అన్నట్టు రాజు బల్ల దగ్గరే భోజనం చేస్తూ వచ్చాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Then said Ziba unto the king, According to all that my lord the king hath commanded his servant, so shall thy servant do. As for Mephibosheth, said the king, he shall eat at my table, as one of the king’s sons.
In Context
10కాబట్టి నువ్వు, నీ కొడుకులు, దాసులు అతని కోసం ఆ భూమిని సాగు చెయ్యండి. నీ యజమాని కొడుకు తినేందుకు సరిపోయిన ఆహారం ఆ పంట నుండి తీసుకు రావాలి. నీ యజమాని కుమారుడు మెఫీబోషెతు ఎప్పుడూ నా బల్ల దగ్గరే భోజనం చేస్తాడు” అని చెప్పాడు. సీబాకు పదిహేనుమంది కొడుకులు, ఇరవైమంది సేవకులు ఉన్నారు.
12మెఫీబోషెతుకు ఒక కొడుకు ఉన్నాడు. అతడు పసివాడు. అతని పేరు మీకా. సీబా కుటుంబం వారంతా మెఫీబోషెతుకు దాసులుగా ఉన్నారు.
Read all of 2 Samuel 9
Cross References
2 Samuel 15:15అప్పుడు రాజు సేవకులు ఇలా చెప్పారు “అయ్యా, వినండి. నువ్వు మమ్మల్ని ఏలేవాడివి. మాకు రాజువు. నువ్వు చెప్పినట్టు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము.”
2 Samuel 19:17అతనితోపాటు వెయ్యిమంది బెన్యామీనీయులు ఉన్నారు. సౌలు కుటుంబం సేవకుడు సీబా, అతని పదిహేనుమంది కొడుకులు, ఇరవైమంది సేవకులు వచ్చారు.
This Verse In Other Editions
Study 2 Samuel 9:11