2 సమూ 9:7
దావీదు “నువ్వు భయపడవద్దు, నీ తండ్రి యోనాతానును బట్టి తప్పక నీకు మేలు కలిగేలా చేసి, నీ తాత సౌలు భూమి మొత్తాన్ని నీకు తిరిగి ఇప్పిస్తాను. ఇంకా నువ్వు జీవించినంత కాలం నా బల్ల దగ్గరే భోజనం చేస్తావు” అని చెప్పాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Genesis 43:23అందుకతడు “మీకు అంతా క్షేమమే. భయపడవద్దు. మీ తండ్రి దేవుడూ, మీ దేవుడు, మీ సంచుల్లో మీ డబ్బు పెట్టి ఉంటాడు. మీ డబ్బు నాకు అందింది” అని చెప్పి షిమ్యోనును వారి దగ్గరికి తెచ్చాడు.
Ruth 2:11నువ్వు నీ తల్లిదండ్రులనూ, పుట్టిన దేశాన్నీ విడిచిపెట్టి నీకు ఏమాత్రం పరిచయం లేని ప్రజల మధ్యకు వచ్చావు.
1 Samuel 12:24ఆయన మీ కోసం ఎన్ని గొప్ప పనులు చేశాడో అది మీరు జ్ఞాపకం ఉంచుకుని యెహోవాపట్ల భయభక్తులు కలిగి, కపటం లేని నిండు మనస్సుతో ఆయనను పూజించడం ఎంతో అవసరం.
1 Samuel 22:23నువ్వు భయం లేకుండా నా దగ్గరే ఉండు. నా దగ్గర నువ్వు క్షేమంగా ఉంటావు. నన్నూ నిన్నూ చంపాలని చూసేవాడు ఒక్కడే” అని అబ్యాతారుతో చెప్పాడు.
2 Samuel 9:3అప్పుడు దావీదు “యెహోవా నాపై దయ చూపించినట్టు నేను మేలు చేయడానికి సౌలు కుటుంబంలో ఒక్కడైనా మిగిలి ఉన్నాడా?” అని అతణ్ణి అడిగాడు. అప్పుడు సీబా “యోనాతానుకు కుంటివాడైన ఒక కొడుకు ఉన్నాడు” అని రాజుకు విన్నవించుకున్నాడు.
2 Samuel 12:8అతడి స్త్రీలను నీ కౌగిటిలోకి చేర్చాను. ఇశ్రాయేలు వారిపై, యూదా వారిపై నీకు అధికారం అప్పగించాను. నువ్వు గనుక ఇది చాలదని భావిస్తే నేను ఇంకా ఎక్కువగా నీకు ఇచ్చి ఉండేవాడిని.