Acts 10:14
అయితే పేతురు, “వద్దు ప్రభూ. నిషిద్ధమైన దానినీ అపవిత్రమైన దానినీ నేనెప్పుడూ తినలేదు” అని జవాబిచ్చాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
But Peter said, Not so, Lord; for I have never eaten any thing that is common or unclean.
In Context
13అప్పుడు, “పేతురూ, లేచి చంపుకుని తిను” అనే ఒక శబ్డం అతనికి వినిపించింది.
15“దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధం అనకు” అని మళ్ళీ రెండవసారి ఆ స్వరం అతనికి వినబడింది.
Cross References
Exodus 10:11కాబట్టి పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యెహోవాకు ఉత్సవం జరుపుకోండి. మీరు కోరుకున్నది అదే గదా” అన్నాడు. తరువాత వాళ్ళను ఫరో ఎదుట నుండి వెళ్ళగొట్టారు.
Leviticus 20:25కాబట్టి మీరు శుద్ధ జంతువులకు, అశుద్ధ జంతువులకు, శుద్ధ పక్షులకు, అశుద్ధ పక్షులకు అంతరం తెలుసుకోవాలి. అశుద్ధమైనదని నేను మీకు వేరు చేసి చెప్పిన ఏ జంతువు మూలంగా గానీ ఏ పక్షి మూలంగా గానీ, నేల మీద పాకే దేని మూలంగా గానీ మిమ్మల్ని మీరు అపవిత్ర పరచుకోకూడదు.
Deuteronomy 14:4ఎద్దు, గొర్రె, మేక.
Ezekiel 44:31పక్షుల్లో, పశువుల్లో దానికదే చచ్చినది గాని, మృగాలు చీల్చి చంపినవి గానీ యాజకులు తినకూడదు.”
Matthew 16:22అప్పుడు పేతురు ఆయన్ని ఒక పక్కకి తీసుకు పోయి, “ప్రభూ, అది నీకు దూరమవుతుంది, నీకలా ఎప్పటికీ జరగదు” అని గద్దింపుగా అన్నాడు.
Luke 1:60తల్లి, “అలా కాదు. ఆ బాబుకు యోహాను అని పేరు పెట్టాలి” అంది.