The Bible Software
bible.softwareDanielDaniel 4 › Daniel 4:24

Daniel 4:24

“రాజా, ఈ దర్శనం అర్థం ఏమిటంటే, సర్వోన్నతుడైన దేవుడు రాజువైన నిన్ను గూర్చి ఈ విధంగా తీర్మానం చేశాడు.

బైబిల్ (తెలుగు)

In The King James Version

This is the interpretation, O king, and this is the decree of the most High, which is come upon my lord the king:

In Context

23“ఈ చెట్టును నరికివేయండి. దాని కొమ్మలు, ఆకులు కొట్టివేసి, దాని పండ్లను పారవేయండి. చెట్టు నీడలో ఉన్న పశువులను తోలివేయండి. పక్షులన్నిటినీ కొమ్మల నుండి ఎగరగొట్టండి. అయితే దాని వేరులతో ఉన్న మొద్దును ఇనుముతో, ఇత్తడితో కట్టి పొలం గడ్డిలో విడిచిపెట్టండి. దాని వేళ్ళు భూమిలో ఉండిపోనివ్వండి, అని మేల్కొలుపు దూత పరలోకం నుండి దిగివచ్చి ప్రకటించడం నువ్వు విన్నావు గదా.”

25ప్రజలు తమ దగ్గర ఉండకుండా నిన్ను తరుముతారు. నువ్వు అడవి జంతువుల మధ్య నివసిస్తూ పశువులాగా గడ్డి తింటావు. ఆకాశం నుండి పడే మంచు నిన్ను తడుపుతుంది. సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యాలపై అధికారిగా ఉండి, ఆయన ఎవరికి ఇవ్వాలని నిర్ణయిస్తాడో వాళ్లకు అనుగ్రహిస్తాడు, అని నువ్వు తెలుసుకునే వరకూ ఏడు కాలాలపాటు నీ పట్ల ఇలా జరుగుతుంది.

Read all of Daniel 4

Cross References

Job 1:12అప్పుడు యెహోవా “ఇదిగో, అతనికి ఉన్నదంతా నీ ఆధీనంలో ఉంచుతున్నాను. అతనికి మాత్రం నువ్వు ఎలాంటి కీడు తలపెట్టకూడదు” అని అపవాదికి చెప్పాడు. అప్పుడు వాడు యెహోవా సమక్షంలో నుండి వెళ్ళిపోయాడు.

Job 40:11నీ ఆగ్రహాన్ని నలుదెసలా విసిరి వెయ్యి. గర్విష్టులందరినీ చూసి వారిని కూలగొట్టు. 1

Psalms 107:40శత్రువులు రాజులను తృణీకరిస్తూ దారిలేని ఎడారిలో వారిని తిరుగులాడజేశాడు. 1

Proverbs 16:6నిబంధన విశ్వసనీయత, నమ్మకత్వం దోషానికి తగిన పరిహారం కలిగిస్తాయి. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉన్నవాడు దుష్టత్వం నుండి దూరంగా తొలగిపోతాడు.

Isaiah 14:24సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలా అంటున్నాడు. “కచ్చితంగా నేను ఉద్దేశించినట్టే అది జరుగుతుంది. నేను యోచన చేసినట్టే అది ఉంటుంది. 1

Isaiah 46:10ఆది నుండి అంతం వరకు కలగబోయే వాటిని నేను ప్రకటిస్తాను. ఇంకా జరగని వాటిని ముందుగానే తెలియజేస్తాను. 1 “నా సంకల్పం జరుగుతుంది. నా చిత్తమంతా నేను నెరవేర్చుకుంటాను” అని నేను చెబుతున్నాను. 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Daniel 4:24

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Daniel 4:23Daniel 4Daniel 4:25 →