Daniel 6:16
రాజు ఆజ్ఞ ఇవ్వగా సైనికులు దానియేలును పట్టుకుని సింహాల గుహలో పడవేశారు. అప్పుడు రాజు “నువ్వు ప్రతిరోజూ తప్పకుండా సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు” అని దానియేలుతో చెప్పాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
2 Samuel 3:39పట్టాభిషేకం అయిన నేను ఈ రోజు బలం లేనివాడినయ్యాను. సెరూయా కొడులైన ఈ వ్యక్తులు నాకంటే బలమైనవారు. వారు చేసిన దుష్టకార్యాలను బట్టి వారు కీడు చేసిన ప్రకారం యెహోవా వారికి ప్రతీకారం చేస్తాడు గాక.”
Psalms 37:39నీతిపరులకు యెహోవా దగ్గరనుండే ముక్తి కలుగుతుంది. వేదన సమయంలో ఆయన వాళ్ళను కాపాడతాడు. 1
Psalms 118:8మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. 1
Isaiah 43:2నువ్వు ప్రవాహాలను దాటేటప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. 1 నదులగుండా వెళ్ళేటప్పుడు అవి నిన్ను ముంచివేయవు. 1 నువ్వు అగ్నిగుండా నడచినా కాలిపోవు, జ్వాలలు నీకు కీడు చేయవు 1
Jeremiah 38:5అందుకు రాజైన సిద్కియా “అతడు మీ చేతిలో ఉన్నాడు. రాజు మీకు అడ్డం రాగలడా,” అన్నాడు.
Jeremiah 39:17ఆ రోజున నేను నిన్ను విడిపిస్తాను. నువ్వు భయపడే మనుషుల చేతికి నిన్ను అప్పగించడం జరగదు’ అని యెహోవా అంటున్నాడు,