ద్వితీ 12:11
నేను మీకు ఆజ్ఞాపించేవాటన్నిటిననీ, అంటే మీ హోమ బలులు, బలులు, దశమ భాగాలు, ప్రతిష్ఠిత నైవేద్యాలు, మీరు యెహోవాకు చేసే శ్రేష్ఠమైన మొక్కుబళ్లను మీ దేవుడైన యెహోవా తన పేరుకు నివాసంగా ఏర్పాటు చేసుకునే స్థలానికే మీరు తీసుకురావాలి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Leviticus 17:4దాన్ని యెహోవాకి అర్పించడానికి ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గరికి దాన్ని తీసుకు రాకపోతే అతడు రక్తం విషయంలో అపరాధి అవుతాడు. అతడు రక్తం చిందించాడు, కాబట్టి అలాంటి వాడు ప్రజల్లో లేకుండా పోవాలి.
Deuteronomy 12:14కేవలం యెహోవా మీ గోత్రాల్లో ఒకదాని మధ్య ఏర్పాటు చేసుకునే స్థలంలోనే మీ హోమబలులు అర్పించి నేను మీకు ఆజ్ఞాపించే సమస్తాన్నీ అక్కడే జరిగించాలి.
Deuteronomy 12:21నీ దేవుడు యెహోవా తన సన్నిధిని నిలిపి ఉంచడానికి ఎన్నుకున్న స్థలం మీకు దూరంగా ఉన్నట్లయితే,
Deuteronomy 14:23మీ జీవితమంతటిలో మీ దేవుడైన యెహోవాను మీరు గౌరవించాలంటే ఆయన తన నామానికి నివాస స్థానంగా ఏర్పాటు చేసుకొన్న స్థలంలో, ఆయన సన్నిధిలో మీ పంటలో, ద్రాక్షారసంలో, నూనెలో పదో పంతును, మీ పశువుల్లో గొర్రెల్లో మేకల్లో తొలిచూలు వాటిని తినాలి.
Deuteronomy 15:20మీ యెహోవా దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలంలో మీరు, మీ ఇంటివారు ఆయన సన్నిధిలో ప్రతి సంవత్సరం దాన్ని తినాలి.
Deuteronomy 17:8హత్యకూ, ప్రమాదవశాత్తూ జరిగిన మరణానికీ మధ్య, ఒకడి హక్కూ మరొకడి హక్కూ మధ్య, దెబ్బ తీయడం మరొక రకంగా నష్టపరచడం మధ్య, మీ గ్రామాల్లో భేదాలు వచ్చి, వీటి తేడా తెలుసుకోవడం మీకు కుదరకపోతే