ద్వితీ 14:22
ప్రతి సంవత్సరం, మీ విత్తనాల పంటలో దశమ భాగాన్ని తప్పనిసరిగా వేరు చెయ్యాలి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Thou shalt truly tithe all the increase of thy seed, that the field bringeth forth year by year.
In Context
Cross References
Genesis 47:24నాలుగు భాగాలు మీవి. పంటలో అయిదవ భాగం మీరు ఫరోకు ఇవ్వాలి. అది పొలాల్లో విత్తడానికీ మీ పిల్లలకూ మీ ఇంట్లోవారి ఆహారానికి” అని ప్రజలతో చెప్పాడు.
Leviticus 27:30ధాన్యంలో, చెట్ల కాయల్లో, భూమి ఫలమంతటిలో పదవ వంతు యెహోవా స్వంతం. అది యెహోవాకు ప్రతిష్ఠితం అవుతుంది.
Numbers 18:31మీరూ, మీ కుటుంబాలూ ఏ స్థలంలోనైనా వాటిని తినొచ్చు. ఎందుకంటే సన్నిధి గుడారంలో మీరు చేసే సేవకు అది మీకు జీతం.
Deuteronomy 12:17మీ ధాన్యంలో, ద్రాక్షారసంలో, నూనెలో, దశమ భాగం, మీ ఆవులు, గొర్రెలు, మేకల్లో తొలిచూలు పిల్లల్లో, మీరు చేసే మొక్కుబళ్లలో స్వేచ్ఛార్పణలు, ప్రతిష్ఠార్పణలు మీ ఇంట్లో తినకూడదు.
Nehemiah 10:37అంతేకాక, మా పిండిలో ప్రథమ ఫలం, ప్రతిష్టితమైన అర్పణలు, అన్ని రకాల చెట్ల పళ్ళూ, ద్రాక్షారసం, నూనె మొదలైనవాటిని మా దేవుని మందిరపు గదుల్లోకి యాజకుల దగ్గరికి తీసుకురావాలనీ, మా భూమి సాగులో పదవ వంతు లేవీయుల దగ్గరికి తీసుకురావాలనీ, అన్ని పట్టణాల్లో ఉన్న మా పంట సాగులో పదవ భాగాన్ని లేవీయులకు ఇవ్వాలనీ నిర్ణయించుకున్నాం.