ద్వితీ 31:18
వాళ్ళు ఇతర దేవుళ్ళ వైపు తిరిగి, చేసిన దుర్మార్గమంతటిబట్టి ఆ రోజు నేను తప్పకుండా వారికి నా ముఖం చాటు చేస్తాను.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Exodus 34:15ఆ దేశాల్లో నివసించే ప్రజలతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోకుండా ఉండేలా జాగ్రత్త వహించాలి. ఆ ప్రజలు ఇతరుల దేవుళ్ళ విషయం వ్యభిచారుల్లా ప్రవర్తిస్తారు. వాళ్ళ దేవుళ్ళకు అర్పించిన నైవేద్యాలు తినమని ఎవరైనా నిన్ను ప్రేరేపించినప్పుడు వాటి విషయం జాగ్రత్త వహించాలి.
Deuteronomy 32:20ఆయనిలా అన్నాడు. “వారికి నా ముఖాన్ని దాచు కుంటాను. 1 వాళ్ళ అంతం ఎలా ఉంటుందో చూస్తాను. 1 వాళ్ళు మొండి తరం, 1 విశ్వసనీయత లేని పిల్లలు. 1
Isaiah 5:25దాన్నిబట్టి యెహోవా కోపం ఆయన ప్రజల మీద మండుతున్నది. 1 ఆయన వారి మీదికి తన బాహువు చాచి వారిని కొట్టాడు. పర్వతాలు వణుకుతున్నాయి. 1 వీధుల్లో వారి శవాలు చెత్తలాగా పడి ఉన్నాయి. 1 ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు. కొట్టడానికి ఆయన చెయ్యి ఇంకా చాపి ఉంది. 1
Jeremiah 33:5‘యుద్ధం చెయ్యడానికి కల్దీయులు వస్తున్నారు. నా ఉగ్రతను బట్టి, నా ఆగ్రహాన్ని బట్టి, తమ దుష్టత్వం కారణంగా నేను ఈ పట్టణం నుండి ముఖం తిప్పేసుకున్నందు వల్ల హతమయ్యే ప్రజల శవాలతో ఆ ఇళ్ళను నింపడానికి వారు వస్తున్నారు.