Deuteronomy 4:27
అంతేగాక యెహోవా మిమ్మల్ని వివిధ జాతుల మధ్యకు చెదరగొడతాడు. ఆయన మిమ్మల్ని ఎక్కడికి తోలివేస్తాడో అక్కడి ప్రజల్లో మీరు కొద్దిమందిగా మిగిలి ఉంటారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Deuteronomy 28:36యెహోవా మిమ్మల్నీ, మీ మీద నియమించుకునే మీ రాజునూ, మీరూ మీ పూర్వీకులూ ఎరగని వేరే దేశప్రజలకు అప్పగిస్తాడు. అక్కడ మీరు చెక్క ప్రతిమలను, రాతిదేవుళ్ళనూ పూజిస్తారు.
Deuteronomy 28:63మీకు మేలు చేయడంలో, మిమ్మల్ని అభివృద్ది చేయడంలో మీ యెహోవా దేవుడు మీపట్ల ఎలా సంతోషించాడో అలాగే మిమ్మల్ని నాశనం చెయ్యడానికి, మిమ్మల్ని హతమార్చడానికి యెహోవా సంతోషిస్తాడు. మీరు స్వాధీనం చేసుకోడానికి ప్రవేశిస్తున్న దేశం నుంచి తొలగించి వేస్తాడు.
Nehemiah 1:8నీ సేవకుడైన మోషేకు నీవు చెప్పిన మాట గుర్తు చేసుకో. ‘మీరు అపరాధం చేస్తే లోక జాతుల్లోకి మిమ్మల్ని చెదరగొట్టి వేస్తాను.
Ezekiel 11:16కాబట్టి వాళ్ళకి ఇలా చెప్పు. “ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు, దూరంగా ఉన్న జాతుల్లోకి నేను వారిని తొలగించినా, ఇతర దేశాల్లోకి వాళ్ళని నేను చెదరగొట్టినా వాళ్ళు చెదరిపోయిన దేశాల్లో నేను వారికి కొంతకాలం పరిశుద్ద ఆలయంగా ఉంటాను”
Ezekiel 20:23వాళ్ళు నా విధులు అనుసరించకుండా, నా కట్టడలు తృణీకరించి, నేను విధించిన విశ్రాంతిదినాలను అపవిత్రం చేసి,
Hosea 9:17వారు నా దేవుని మాట వినలేదు గనక ఆయన వారిని విసర్జించాడు. వారు దేశం విడిచి అన్యజనుల్లో దేశదిమ్మరులౌతారు.