ఎఫెసీ పత్రిక 5:6
పనికిమాలిన మాటలు పలికేవారి వల్ల మోసపోకండి. అలాటి వాటివల్ల అవిధేయుల పైకి దేవుని ఉగ్రత వస్తుంది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
7కాబట్టి వారికి దూరంగా ఉండండి.
Cross References
Numbers 32:13అప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవా కోపం రగులుకోవడం వల్ల ఆయన దృష్ఠికి చెడుతనం చూపిన ఆ తరం వారంతా నాశనం అయ్యే వరకూ వారిని అరణ్యంలో తిరిగేలా చేశాడు.
2 Kings 18:20యుద్ధం విషయంలో నీ ఆలోచన, నీ బలం అన్నీ వట్టి మాటలే. నా మీద తిరుగుబాటు చెయ్యడానికి నీకు ధైర్యం ఇచ్చింది ఎవరు?
Jeremiah 23:14యెరూషలేము ప్రవక్తల మధ్య ఘోరమైన పనులు నేను చూశాను. వాళ్ళు వ్యభిచారులు. మోసంలో నడుస్తున్నారు. వాళ్ళు దుర్మార్గుల చేతులను బలపరుస్తున్నారు! ఎవడూ తన దుర్మార్గం విడిచిపెట్టడం లేదు. వాళ్ళంతా నా దృష్టికి సొదొమ ప్రజల్లాగా మారారు. యెరూషలేము నివాసులు గొమొర్రా ప్రజల్లాగా మారారు. 1
Jeremiah 29:31“బందీలుగా ఉన్న వాళ్ళందరికీ నువ్వు కబురంపి ఇలా చెప్పు, ‘యెహోవా నెహెలామీయుడైన షెమయా గురించి ఇలా అంటున్నాడు, నేను అతణ్ణి పంపకపోయినా, షెమయా మీకు ప్రవచించి మీరు అబద్ధపు మాటలు నమ్మేలా చేశాడు కాబట్టి,
Micah 3:5నా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రవక్తలను గురించి యెహోవా చెప్పేదేమిటంటే, 1 తమకు భోజనం పెట్టేవారికి “సంపద వస్తుంది” అని చెబుతారు. 1 భోజనం పెట్టకపోతే, వారి మీద యుద్ధం ప్రకటిస్తారు. 1
Matthew 24:24కపట క్రీస్తులు, కపట ప్రవక్తలు వచ్చి, సాధ్యమైతే దేవుడు ఎన్నుకున్న వారిని కూడా మోసగించడానికి గొప్ప సూచక క్రియలూ, అద్భుతాలూ జరిగిస్తారు.