ఎఫెసీ పత్రిక 6:20
సంకెళ్ళలో ఉన్న నేను ఈ సువార్త నిమిత్తమైన రాయబారిని. నేను ఈ సువార్తను ఎలాంటి ధైర్యంతో ప్రకటించాలో అలాంటి ధైర్యంతో ప్రకటించాలి గదా.
బైబిల్ (తెలుగు)
In The King James Version
For which I am an ambassador in bonds: that therein I may speak boldly, as I ought to speak.
In Context
Cross References
2 Samuel 10:2దావీదు “హానూను తండ్రి నాహాషు నాకు చేసిన సహాయానికి బదులు నేను హానూనుకు ఏదైనా మేలు చేయాలి” అనుకుని అతని తండ్రి చనిపోయినందుకు అతన్ని తన తరపున ఓదార్చడానికి మనుషులను పంపించాడు. వారు అమ్మోనీయుల దేశానికి వెళ్ళారు.
Isaiah 33:7వాళ్ళ రాయబారులు వీధిలో ఏడుస్తున్నారు. సంధిని కోరుకునే వాళ్ళ రాజనీతిజ్ఞులు ఒకటే రోదిస్తున్నారు. 1
Jeremiah 1:7అయితే యెహోవా నాతో ఇలా అన్నాడు. “నేను పిల్లవాణ్ణి అనవద్దు. నేను నిన్ను పంపేవారందరి దగ్గరకీ నువ్వు వెళ్ళాలి. 1 నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ వారితో చెప్పాలి. 1
Ezekiel 2:4వాళ్ళ వారసులు ఒట్టి మూర్ఖులు. వాళ్ళ హృదయాలు కఠినం. వాళ్ళ దగ్గరకి నిన్ను పంపిస్తున్నాను. నువ్వు ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు’ అని వాళ్ళకి చెప్పాలి.
Acts 5:29అందుకు పేతురు, మిగిలిన అపొస్తలులు ఇలా జవాబిచ్చారు, “మనుషులకు కాక, దేవునికే మేము లోబడాలి గదా.
Acts 26:29అందుకు పౌలు, “తేలికగానో కష్టంగానో, మీరు మాత్రమే కాదు, ఈ రోజు నా మాట వింటున్న వారంతా ఈ సంకెళ్ళు తప్ప నాలాగానే ఉండేలా దేవుడు అనుగ్రహిస్తాడు గాక” అన్నాడు.