Exodus 12:11
మీరు దాన్ని తినవలసిన విధానం ఇది. మీ నడుముకు నడికట్టు కట్టుకుని, కాళ్ళకు చెప్పులు వేసుకుని, మీ కర్రలు చేతబట్టుకుని + 12:11 అంటే ప్రయాణానికి సిద్ధమై తినాలి.త్వరత్వరగా తినాలి. ఎందుకంటే అది యెహోవాకు + 12:11 పస్కా అంటే, ఐగుప్టు వారి మొదటి సంతానాన్ని వధించడానికి సంహార దూత బయలు దేరినప్పుడు అతడు ఇశ్రాయేల్ వారిని దాటిపోయిన సంగతిని జ్ఞాపకం చేసుకోవడానికి ఉన్న పండగ. పస్కా బలి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
10తెల్లవారే పాటికి దానిలో ఏమీ మిగల్చకూడదు. ఒకవేళ ఏమైనా మిగిలితే దాన్ని పూర్తిగా కాల్చివెయ్యాలి.
Cross References
Exodus 12:13మీరు నివసించే ఇళ్ళపై ఉన్న ఆ రక్తం యెహోవా రాక విషయంలో మీకు ఆనవాలుగా ఉంటుంది. నేను ఐగుప్తు జాతి మొదటి సంతానాన్ని నాశనం చేస్తూ ఉన్న సమయంలో ఆ రక్తాన్ని చూసి మిమ్మల్ని చంపకుండా దాటి వెళ్ళిపోతాను. ఈ విపత్తు మీ మీదికి వచ్చి మిమ్మల్ని నాశనం చేయదు. 1 పొంగని రొట్టెల పండగ
Exodus 12:27‘ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను సంహరించే సమయంలో వారి మధ్య నుండి ఇశ్రాయేలు ప్రజల ఇళ్ళను దాటి ఐగుప్తులో మనల్ని కాపాడాడు’ అని చెప్పాలి” అన్నాడు. అప్పుడు సమకూడిన ప్రజలంతా అది విని తమ తలలు వంచి దేవుణ్ణి ఆరాధించారు.
Leviticus 23:5+ 23:5 ఇది మార్చి 16 నుంచి ఏప్రిల్ 17 లోపల వస్తుంది.మొదటి నెల పద్నాలుగో రోజు సాయంత్రం యెహోవా పస్కా పండగ జరుగుతుంది.
Numbers 28:16మొదటి నెల 14 వ రోజు యెహోవా పస్కాపండగ వస్తుంది.
Deuteronomy 16:2యెహోవా తన నామాన్ని స్థాపించడానికి ఏర్పాటు చేసుకున్న స్థలంలోనే మీ యెహోవా దేవునికి పస్కా ఆచరించి, గొర్రెలను, మేకలను, ఆవులను బలి అర్పించాలి.
2 Kings 23:21అప్పుడు రాజు “నిబంధన గ్రంథంలో రాసి ఉన్న ప్రకారంగా మీ దేవుడైన యెహోవాకు పస్కా పండగ ఆచరించండి” అని ప్రజలందరికీ ఆజ్ఞాపించాడు.