Exodus 18:23
ఇలా చేయడానికి దేవుడు అనుమతి ఇస్తే, నీ పని తేలిక అవుతుంది. ఈ ప్రజలంతా తమ ఇళ్ళకు సంతృప్తిగా వెళ్తారు” అని చెప్పాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
24మోషే తన మామ మాట విని అతడు చెప్పినట్టు చేశాడు.
Cross References
Genesis 21:10ఆమె అబ్రాహాముతో ఇలా అంది. “ఈ దాసీనీ ఈమె కొడుకునీ వెళ్ళగొట్టు. ఎందుకంటే ఈ దాసీ కొడుకు నా కొడుకు ఇస్సాకుతో కలసి వారసుడిగా ఉండటానికి వీలులేదు.”
Exodus 16:29వినండి, యెహోవా ఈ విశ్రాంతి దినాన్ని తప్పకుండా ఆచరించాలని సెలవిచ్చాడు. కనుక ఆరవ రోజున రెండు రోజులకు సరిపడే ఆహారం మీకు ఇస్తున్నాడు. ఏడవ రోజున ప్రతి ఒక్కరూ తమ స్థలాల్లోనే ఉండిపోవాలి.”
1 Samuel 8:6“మాకు న్యాయం చేయడానికి ఒక రాజును నియమించు” అని వారు అడిగిన మాట సమూయేలుకు రుచించలేదు. అప్పుడు సమూయేలు యెహోవాకు ప్రార్థన చేశాడు.
2 Samuel 18:3అందుకు వారు “నువ్వు మాతో రాకూడదు. మేము పారిపోయినా ప్రజలు దాన్ని పట్టించుకోరు, మాలో సగం మంది చనిపోయినా ఎవ్వరూ పట్టించుకోరు. మాలాంటి పది వేలమందితో నువ్వు ఒక్కడివి సమానం. కాబట్టి నీవు పట్టణంలోనే ఉండి మాకు సూచనలిస్తూ సహాయం చెయ్యి” అని చెప్పారు.
2 Samuel 21:17సెరూయా కొడుకు అబీషై రాజును కాపాడి ఆ ఫిలిష్తీయుణ్ణి కొట్టి చంపాడు. ఇది చూసిన దావీదు మనుషులు “ఇశ్రాయేలీయులకు దీపమైన నువ్వు ఆరిపోకుండా ఉండేలా ఇకపై మాతో కలసి యుద్ధాలకు రావద్దు” అని చెప్పి, అతని చేత ఒట్టు పెట్టించారు.
Galatians 2:2మేము వెళ్ళాలని దేవుడు దర్శనంలో నాకు చెబితేనే వెళ్ళాను. నా ప్రయాస వ్యర్థమైపోతుందేమో, లేక వ్యర్థమైపోయిందేమో అని నేను యూదేతరులకు ప్రకటిస్తున్న సువార్త గురించి విశ్వాసుల్లో ముఖ్యమైన నాయకులకు ఏకాంతంగా వివరించాను.