Exodus 22:29
నీ మొదటి కోత అర్పణలు ఇవ్వడంలో ప్రథమ ఫలాలు ఇవ్వడంలో ఆలస్యం చేయకూడదు. నీ కొడుకుల్లో మొదటివాణ్ణి నాకు ప్రతిష్టించాలి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
28నువ్వు దేవుణ్ణి దూషించకూడదు. నీ ప్రజల అధికారుల్లో ఎవరినీ శపించ కూడదు.
Cross References
Exodus 13:12మీకు పుట్టే ప్రతి మొదటి సంతానాన్ని, మీ పశువులకు పుట్టే ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠించాలి. పశువులకు, మందలకు కలిగే తొలి మగ సంతానం యెహోవాదే.
Exodus 23:19నీ భూమిలో పండే వాటిలో ప్రథమ ఫలాలు యెహోవా దేవుని మందిరానికి తీసుకురావాలి. మేకపిల్ల మాంసం దాని తల్లిపాలలో కలిపి ఉడకబెట్ట కూడదు. 1 కనానుకు నడిపిస్తానని వాగ్దానం
Leviticus 22:27“దూడగాని, గొర్రెపిల్లగాని, మేకపిల్లగాని పుట్టినప్పుడు అది ఏడు రోజులు దాని తల్లితో ఉండాలి. ఎనిమిదవ రోజు మొదలు అది యెహోవాకు హోమంగా అంగీకారమే.
Deuteronomy 15:19మీ ఆవులు, గొర్రెలు, మేకల్లో ప్రతి తొలి చూలు మగపిల్లను యెహోవా దేవునికి ప్రతిష్ఠించాలి. మీ కోడెల్లో తొలిచూలు దానితో పనిచేయకూడదు. మీ గొర్రెలు, మేకల్లో తొలిచూలు దాని బొచ్చు కత్తిరించకూడదు.
2 Kings 4:42తరువాత బయల్షాలిషా నుండి ఒక వ్యక్తి కొత్తగా పండిన యవల పిండితో చేసిన ఇరవై రొట్టెలనూ, తాజాగా కోసిన ధాన్యాన్నీ ఒక బస్తాలో వేసుకుని దేవుని మనిషి కోసం తీసుకు వచ్చాడు. అప్పుడు అతడు “వీటిని వడ్డించు, ఇక్కడున్నవారు భోజనం చేస్తారు” అని చెప్పాడు.
Proverbs 3:9యెహోవాకు నీ రాబడి మొత్తంలో ప్రథమ ఫలం, నీ ఆస్తిలో వాటా ఇచ్చి ఆయనను ఘనపరచు.