యెహెజ్కేలు 13:11
గోడకి సున్నం వేస్తున్న వాళ్ళకి ఇలా చెప్పు. ఇది కూలిపోతుంది. జడివాన కురుస్తుంది. దీన్ని పడగొట్టడానికి నేను పిడుగులు పంపిస్తాను. పడిన గోడను చిన్నాభిన్నం చేయడానికి గాలి తుఫానుని పంపుతాను.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
12ఆ గోడ పడిపోయినప్పుడు ప్రజలు మిమ్మల్ని ‘మీరు వేసిన సున్నం ఎక్కడ?’ అని అడుగుతారా లేదా?”
Cross References
Job 27:21తూర్పు గాలి అతణ్ణి ఎగరగొడుతుంది. వాడు ఇక ఉండడు. అది అతని స్థలంలో నుండి అతణ్ణి ఊడ్చివేస్తుంది. 1
Psalms 11:6దుర్మార్గుల మీద ఆయన రగులుతున్న నిప్పు కణికెలు, అగ్నిగంధకం కురిపిస్తాడు. ఆయన గిన్నెలోని వడగాలి వాళ్ళ పానీయభాగం అవుతుంది. 1
Psalms 32:6దీని కారణంగా భయభక్తులు కలిగిన వాడు నువ్వు దొరికే సమయంలో నీకు ప్రార్ధించాలి. అప్పుడు జల ప్రవాహాలు ఉప్పొంగినా అవి అతని దగ్గరకు రావు. 1
Isaiah 28:2వినండి! శక్తిశాలీ, బలశాలీ అయిన ఒకడు ప్రభువుకి ఉన్నాడు. అతడు వడగళ్ళ లాంటి వాడు. 1 అతడు వినాశనకారి అయిన తుఫాను వంటివాడు. ముంచెత్తే బలమైన జడివాన వంటివాడు. ఆయన తన చేతితో భూమిని కొడతాడు. 1
Isaiah 28:18చావుతో మీరు చేసుకున్న నిబంధనను రద్దు చేస్తాను. పాతాళంతో మీరు చేసుకున్న ఒప్పందం చెల్లదు. 1 వరద ప్రవాహంలా విపత్తు మీకు పైగా దాటినప్పుడు మీరు ఉక్కిరిబిక్కిరి అవుతారు. 1
Isaiah 32:19కానీ వడగళ్ళు పడి అరణ్యం నాశనమైనప్పుడు పట్టణం పూర్తిగా తుడిచి పెట్టుకుపోతుంది. 1