యెహెజ్కేలు 13:19
చారెడు బార్లీ గింజలకీ కొన్ని రొట్టె ముక్కలకీ ఆశపడి ప్రజల్లో నా పేరును అవమానపరిచారు. అబద్ధాలు వినే నా ప్రజలకు అబద్ధాలు చెప్తూ వాళ్ళు నిర్దోషులను చంపేలా, చావడానికి అర్హులైన వాళ్ళను విడిచిపెట్టేలా చేశారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
1 Samuel 2:16“అలా కాదు, ముందు కొవ్వును దహించాలి, తరువాత నీకు కావలసినంత తీసికోవచ్చు” అని అతనితో చెబితే, వాడు “అలా వద్దు, ఇప్పుడే ఇవ్వాలి, లేకపోతే బలవంతంగా తీసుకుంటాం” అనేవాడు.
Proverbs 19:27కుమారా, బుద్ధి చెప్పే మాటలు వినడం మానుకుంటే జ్ఞాన వాక్కులకు నీవు దూరమై పోతావు.
Isaiah 5:20కీడును మేలనీ మేలును కీడనీ చెప్పేవారికి, చీకటిని వెలుగుగా వెలుగును చీకటిగా ఎంచే వారికి బాధ. 1 చేదును తీపి అనీ తీపిని చేదు అనీ భావించే వారికి బాధ. 1
Jeremiah 23:17“మీకు శాంతిక్షేమాలు కలుగుతాయని యెహోవా చెబుతున్నాడు” అని నన్ను తృణీకరించే వాళ్ళతో అదే పనిగా చెబుతున్నారు. “మీ మీదికి ఏ కీడూ రాదు” అని తన హృదయ మూర్ఖత ప్రకారం నడుచుకునే ప్రతివారూ చెబుతున్నారు. 1
Ezekiel 20:39ఇశ్రాయేలు ఇంటివారలారా, ప్రభువైన యెహోవా మీతో చెప్పేదేమంటే “మీరు నామాట వినకపోతే, మీరు పెట్టుకున్న విగ్రహాలు మీ కిష్టమైనట్టుగా పూజించుకోండి, కాని మీ అర్పణల వల్ల, మీ విగ్రహాల వల్ల, నా పవిత్రమైన పేరును అపవిత్రం చెయ్యొద్దు.”
Ezekiel 22:27దానిలో రాజకుమారులు లాభం సంపాదించడానికి నరహత్య చెయ్యడంలో, మనుషులను నాశనం చెయ్యడంలో వేటను చీల్చే తోడేళ్లలా ఉన్నారు.