యెహెజ్కేలు 37:3
ఆయన “నరపుత్రుడా, ఎండిపోయిన యీ ఎముకలు బతుకుతాయా?” అని నన్నడిగితే “ప్రభూ, యెహోవా, అది నీకే తెలుసు” అన్నాను.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And he said unto me, Son of man, can these bones live? And I answered, O Lord GOD, thou knowest.
In Context
2ఆ లోయలో చాలా ఎముకలు కనిపించాయి. అవి బాగా ఎండిపోయినవి.
4అందుకాయన ప్రవచనాత్మకంగా ఎండిపోయిన ఈ ఎముకలతో ఇలా చెప్పు. “ఎండిపోయిన ఎముకలారా! యెహోవా మాట వినండి.
Cross References
Deuteronomy 32:39చూడండి. నేనే, నేను మాత్రమే దేవుణ్ణి. 1 నేను తప్ప మరో దేవుడు లేడు. 1 చంపేది నేనే, బతికించేది నేనే. 1 దెబ్బ కొట్టేది నేనే, బాగు చేసేది నేనే. 1 నా చేతిలో నుంచి విడిపించేవాడెవడూ లేడు. 1
Psalms 88:11సమాధిలో నీ కృపను ఎవరైనా చాటిస్తారా? శ్మశానంలో నీ విశ్వసనీయతను ఎవరైనా వివరిస్తారా? 1
John 6:5యేసు తలెత్తి చూసినప్పుడు పెద్ద జన సమూహం తన వైపు రావడం కనిపించింది. అప్పుడు ఆయన ఫిలిప్పుతో, “వీరంతా భోజనం చేయడానికి రొట్టెలు ఎక్కడ కొనబోతున్నాం?” అని అడిగాడు.
Acts 26:8దేవుడు మృతులను లేపుతాడన్న సంగతి నమ్మశక్యం కానిదని మీరెందుకు భావిస్తున్నారు?
2 Corinthians 1:9వాస్తవంగా, మాకు మరణదండన విధించినట్టు అనిపించింది. అయితే చనిపోయిన వారిని లేపే దేవుని మీద తప్ప, మా మీద మేము నమ్మకం ఉంచకుండేలా అలా జరిగింది.