యెహెజ్కేలు 4:3
తరువాత నువ్వు ఒక ఇనుప రేకును తీసుకుని దాన్ని నీకూ పట్టణానికీ మధ్య ఇనుప గోడగా నిలబెట్టు. పట్టణం ముట్టడికి గురౌతుంది కాబట్టి పట్టణానికి అభిముఖంగా నిలబడు. నీవు పట్టణాన్ని ముట్టడిస్తున్నట్టు ఉంటావు. ఇశ్రాయేలు జాతికి ఇది సూచనగా ఉంటుంది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Leviticus 2:5ఒకవేళ నీ అర్పణ పెనం మీద కాల్చిన నైవేద్యమైతే అది పొంగజేసే పదార్ధం లేకుండా సన్నని పిండితో, నూనె రాసి చేసినదై ఉండాలి.
Isaiah 20:3అప్పుడు యెహోవా ఇలా అన్నాడు. “ఐగుప్తు, ఇతియోపియాలకు ఒక సూచనగా, ఒక శకునంగా నా సేవకుడు యెషయా మూడు సంవత్సరాలు నగ్నంగా, పాదరక్షలు లేకుండా తిరిగాడు. 1
Jeremiah 39:1యూదా రాజైన సిద్కియా పరిపాలనలో తొమ్మిదో సంవత్సరం పదో నెలలో బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యం అంతటితో యెరూషలేమును ముట్టడి వేశాడు.
Ezekiel 12:11నేను మీకు ఒక సూచనగా ఉన్నాను. నేను చేసి చూపినదే వాళ్ళకీ జరుగుతుంది. వాళ్ళు చెరలోకి వెళ్తారు. బందీలుగా దేశాంతరం పోతారు.
Ezekiel 24:27నేను యెహోవానై ఉన్నానని వాళ్ళు తెలుసుకునేలా నువ్వు వాళ్లకు సూచనగా ఉంటావు.”
Hebrews 2:4దేవుడు తన సూచకక్రియలు, అద్భుతాలు, అనేక రకాల గొప్ప గొప్ప కార్యాలు చేయడం ద్వారానూ, తన ఇష్ట ప్రకారం పంచి ఇచ్చిన పరిశుద్ధాత్మ వరాల ద్వారానూ దాన్ని నిర్ధారణ చేశాడు. 1 భూమిని యేసు క్రీస్తుకు లోబరచవలసి ఉంది