యెహెజ్కేలు 44:3
ఇశ్రాయేలు పాలకుడు ఆహారం భుజించేటప్పుడు యెహోవా సన్నిధిలో అక్కడ కూర్చుంటాడు. అయితే అతడు ఈ ద్వారం వసారాగుండా ప్రవేశించి వసారా గుండా బయటికి వెళ్ళాలి.”
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Exodus 24:9ఆ తరువాత మోషే, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలు ప్రజల పెద్దలు 70 మంది కొంతవరకూ కొండ ఎక్కి వెళ్ళారు.
Deuteronomy 12:17మీ ధాన్యంలో, ద్రాక్షారసంలో, నూనెలో, దశమ భాగం, మీ ఆవులు, గొర్రెలు, మేకల్లో తొలిచూలు పిల్లల్లో, మీరు చేసే మొక్కుబళ్లలో స్వేచ్ఛార్పణలు, ప్రతిష్ఠార్పణలు మీ ఇంట్లో తినకూడదు.
2 Chronicles 23:13ప్రవేశ స్థలం దగ్గర అతనికి ఏర్పాటు చేసిన స్తంభం దగ్గర రాజు నిలబడడం ఆమె చూసింది. అధికారులూ, బాకాలు ఊదేవారూ రాజు దగ్గర ఉండి, దేశంలోని ప్రజలంతా సంతోషిస్తూ, బాకాలతో శబ్దాలు చేస్తూ, గాయకులు సంగీత వాద్యాలతో స్తుతిపాటలు పాడుతూ ఉండడం చూసి బట్టలు చించుకుని “రాజ ద్రోహం! రాజద్రోహం!” అని అరిచింది.
Isaiah 23:18ఆమె పొందిన లాభం, సంపాదన యెహోవాకు చెందుతుంది. దాన్ని సేకరించడం, జమ చేయడం జరగదు. 1 యెహోవా సన్నిధిలో నివసించే వారి భోజనానికీ, మంచి బట్టలకీ ఆమె వర్తక లాభం వినియోగిస్తారు.
Ezekiel 34:24నేను, యెహోవాను, వారికి దేవుడుగా ఉంటాను. నా సేవకుడు దావీదు వారి మధ్య అధిపతిగా ఉంటాడు. ఇదే యెహోవా ప్రభువు సందేశం.
Ezekiel 40:9గుమ్మపు ద్వారం కూడా 3 మీటర్ల 20 సెంటి మీటర్లు. దాని స్తంభాల వెడల్పు ఒక్కొక్కటి ఒక మీటరు. ఆ ద్వారం మందిరం వైపుకు తిరిగి ఉంది.