యెహెజ్కేలు 6:3
ఇశ్రాయేలు పర్వతాల్లారా, ప్రభువైన యెహోవా మాట వినండి. ప్రభువైన యెహోవా పర్వతాలతోనూ, కొండలతోనూ, వాగులతోనూ, లోయలతోనూ ఇలా చెప్తున్నాడు. చూడండి! మీకు విరోధంగా ఖడ్గాన్ని పంపుతున్నాను. మీ ఉన్నత స్థలాలను నాశనం చేస్తాను.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
2“నరపుత్రుడా, ఇశ్రాయేలు పర్వతాలకు అభిముఖంగా నిలబడి ఇలా ప్రకటించు.
Cross References
Leviticus 26:25మీ మీదికి కత్తి రప్పిస్తాను. అది నా నిబంధన విషయం ప్రతి దండన చేస్తుంది. మీరు మీ పట్టణాల్లో సమకూడి ఉండగా మీ మధ్యకు తెగులు రప్పిస్తాను. మీరు శత్రువుల వశమైపోతారు.
1 Kings 14:23వాళ్ళు ఎత్తయిన ప్రతి కొండ మీదా పచ్చని ప్రతి చెట్టు కిందా పూజా స్థలాలను కట్టి, విగ్రహాలు నిలిపి, అషేరా దేవతాస్తంభాలను ఉంచారు.
Jeremiah 2:20పూర్వకాలం నుండి ఉన్న నీ కాడిని విరగగొట్టి, నీ బంధకాలను తెంపివేశాను. అయినా “నేను నిన్ను పూజించను” అని చెబుతున్నావు. 1 ఎత్తయిన ప్రతి కొండ మీదా పచ్చని ప్రతి చెట్టు కిందా వేశ్యలాగా వ్యభిచారం చేశావు. 1
Jeremiah 3:23నిజంగా కొండల మీద జరిగేదంతా మోసం. పర్వతాల మీద చేసిన తంతులన్నీ నిష్‌ప్రయోజనం. 1 నిజంగా మా దేవుడైన యెహోవా వలన మాత్రమే ఇశ్రాయేలుకు రక్షణ కలుగుతుంది. 1
Ezekiel 36:1నరపుత్రుడా, నువ్వు ఇశ్రాయేలు పర్వతాలకు ఈ విషయం చెప్పు, ఇశ్రాయేలు పర్వతాల్లారా, యెహోవా మాట వినండి.
Amos 7:9ఇస్సాకు వంశం వారి ఉన్నత స్థలాలు నాశనమవుతాయి. 2 ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠిత స్థలాలు పాడైపోతాయి. 2 యరొబాము వంశానికి విరోధంగా కత్తి ఎత్తుతాను.” 1 ఆమోసు, అమజ్యా