Ezekiel 7:13
అమ్మినవాడు వాళ్ళు బ్రతికి ఉన్నంత కాలం తాను అమ్మిన భూమికి తిరిగి రాడు. ఎందుకంటే ఈ దర్శనం ప్రజలందరికీ విరోధంగా ఉంది. పాపంలో నివసించే ఏ మనిషీ ధైర్యంగా తన ప్రాణాన్ని దక్కించుకోలేడు. అందుకే వాళ్ళెవ్వరూ తిరిగిరారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
12ఆ సమయం వచ్చేస్తుంది. ఆ రోజు దగ్గర పడింది. నా కోపం ప్రజలందరి పైనా ఉంది కనుక కొనేవాడు సంతోషించకూడదు.
14వాళ్ళు సర్వసన్నద్ధులై బాకా ఊదారు. కానీ యుద్ధానికి బయల్దేరే వాడు ఎవడూ లేడు.
Cross References
Leviticus 25:24నీవు కొనుక్కునే ఆస్తి అంతటి విషయంలో విడుదల హక్కును గుర్తించాలి. నీవు ఎవరినుంచి ఆస్తి కొన్నావో ఆ కుటుంబం దాన్ని తిరిగి కొనుక్కునే సదుపాయం కల్పించాలి.
Job 15:25వాడు దేవునికి విరోధంగా చెయ్యి చాపుతున్నాడు. సర్వశక్తుడైన దేవుణ్ణి ధిక్కరించి మాట్లాడుతున్నాడు. 1
Ecclesiastes 8:8ఊపిరి + 8:8 ఊపిరి ఆత్మ విడవకుండా ఆపుచేయగల అధికారం ఎవరికీ లేదు. 2 తన చావు రోజుపై ఎవరికీ అధికారం లేదు. 2 యుద్దం జరిగే సమయంలో ఎవరికీ విడుదల దొరకదు. 2 దుష్టత్వం దాన్ని వెంబడించే వారిని తప్పించలేదు. 2
Ezekiel 12:28అయితే నువ్వు వాళ్ళకి ఇలా చెప్పు. ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. నా మాటలు ఇక ఆలస్యం కావు. నేను పలికినది తప్పక నెరవేరుతుంది. ఇది ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన.”
Ezekiel 33:26మీరు మీ కత్తిని నమ్ముకుంటారు. నీచమైన పనులు చేస్తారు. పక్కింటివాడి భార్యను పాడు చేస్తారు. కాబట్టి మీరు ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటారా?