Ezra 7:1
ఈ విషయాలన్నీ జరిగిన తరువాత పర్షియా దేశపు రాజు అర్తహషస్త పాలనలో ఎజ్రా బబులోను నుండి యెరూషలేము పట్టణానికి వచ్చాడు. ఇతడు శెరాయా కొడుకు. శెరాయా అజర్యా కొడుకు, అజర్యా హిల్కీయా కొడుకు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
2హిల్కీయా షల్లూము కొడుకు, షల్లూము సాదోకు కొడుకు, సాదోకు అహీటూబు కొడుకు,
Cross References
2 Kings 22:4“నీవు ప్రధాన యాజకుడైన హిల్కీయా దగ్గరికి వెళ్లి, ద్వారపాలకులు ప్రజల దగ్గర వసూలు చేసి యెహోవా మందిరంలో ఉంచిన డబ్బు మొత్తం ఎంతో లెక్క చూడమని అతనితో చెప్పు.
2 Kings 25:18నెబూజరదాను ప్రధానయాజకుడు శెరాయానూ, రెండో యాజకుడు జెఫన్యానూ, ముగ్గురు ద్వార పాలకులనూ పట్టుకున్నాడు.
1 Chronicles 9:11అలాగే నివాసం ఏర్పరచుకున్న వాళ్ళలో అజర్యా ఉన్నాడు. ఈ అజర్యా హిల్కీయా కొడుకు. హిల్కీయా మెషుల్లాము కొడుకు. మెషుల్లాము సాదోకు కొడుకు. సాదోకు మెరాయోతు కొడుకు. మెరాయోతు దేవుని మందిరంలో అధిపతిగా ఉన్న అహీటూబు కొడుకు.
2 Chronicles 34:15అప్పుడు హిల్కీయా “యెహోవా మందిరంలో ధర్మశాస్త్ర గ్రంథం నాకు దొరికింది” అని శాస్త్రి అయిన షాఫానుతో చెప్పి ఆ గ్రంథాన్ని షాఫానుకు అప్పగించాడు.
Ezra 6:14హగ్గయి ప్రవక్త, జెకర్యా ప్రవక్తల హెచ్చరికలతో, వారి పర్యవేక్షణలో యూదుల పెద్దలు ఆలయం కట్టిస్తూ పని సవ్యంగా జరిపించారు. ఈ విధంగా కోరెషు, దర్యావేషు, అర్తహషస్త అనే పర్షియా దేశపు రాజుల ఆజ్ఞ ప్రకారం దేవుని ఆజ్ఞను అనుసరించి ఆలయం నిర్మిస్తూ చివరకూ ఆ పని పూర్తి చేశారు.
Ezra 7:12“రాజైన అర్తహషస్త రాస్తున్నది, ఆకాశంలో ఉండే దేవుని ధర్మశాస్త్రంలో ప్రవీణుడు, యాజకుడు అయిన ఎజ్రాకు క్షేమం కలుగు గాక.