ఎజ్రా 8:15
నేను వీరందరినీ అహవా వైపు ప్రవహించే నది దగ్గర సమకూర్చాను. అక్కడ మేము మూడు రోజులు గుడారాలు వేసుకుని ఉన్నాం. అప్పుడు నేను అక్కడి ప్రజలను, యాజకులను పరిశీలించగా ఒక్క లేవీ గోత్రికుడూ నాకు కనబడలేదు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
14బిగ్వయి వంశంలో ఉన్న ఊతై, జబ్బూదు, వారితో ఉన్న 70 మంది పురుషులు. 1 యెరూషలేముకు తిరిగి రావడం
Cross References
Ezra 7:7రాజైన అర్తహషస్త పాలన ఏడో సంవత్సరంలో కొందరు ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, గాయకులు, ద్వార పాలకులు, దేవాలయ సేవకులు బయలుదేరి యెరూషలేము పట్టణానికి వచ్చారు.
Ezra 7:28నా దేవుడైన యెహోవా కాపుదల నాకు తోడుగా ఉన్నందువల్ల నేను బలపడి, నాతో కలసి పనిచేయడానికి ఇశ్రాయేలీయుల ప్రధానులను సమావేశపరిచాను.
Ezra 8:21అప్పుడు దేవుని సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకుని మాకూ, మా సంతానానికి, మా ఆస్తిపాస్తులకు క్షేమకరమైన ప్రయాణం జరిగేలా దేవుణ్ణి వేడుకోవడానికి అహవా నది దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థించాలని ప్రకటించాను.
Psalms 137:1మనం బబులోను నదుల దగ్గర కూర్చుని ఏడుస్తూ సీయోనును జ్ఞాపకం చేసుకున్నాం. 1
Ezekiel 3:15అలా నేను కెబారు నది దగ్గర తేలాబీబు అనే స్థలానికి వెళ్ళాను. అక్కడ బందీలుగా వచ్చిన కొందరు నివాసముంటున్నారు. అక్కడే నేను ఏడు రోజులు దిగ్భ్రమతో నిండి ఉండిపోయాను.