Ezra 8:35
చెరలోకి వెళ్ళిన వారికి పుట్టి చెర నుండి విడుదలై, తిరిగి వచ్చిన వారు ఇశ్రాయేలు దేవునికి దహన బలులు అర్పించారు. ఇశ్రాయేలీయులందరి పక్షంగా 12 ఎద్దులను, 96 పొట్టేళ్ళను, 77 గొర్రెపిల్లలను అర్పించారు. పాపపరిహారార్థ బలి కోసం 12 మేకపోతులు తెచ్చి అన్నిటినీ దహనబలిగా యెహోవాకు అర్పించారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Leviticus 1:1యెహోవా మోషేని పిలిచి ప్రత్యక్ష గుడారం నుండి అతనితో ఇలా అన్నాడు.
2 Chronicles 29:31అప్పుడు హిజ్కియా “మీరిప్పుడు యెహోవాకు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకున్నారు. దగ్గరికి రండి. యెహోవా మందిరంలోకి బలులూ కృతజ్ఞతార్పణలనూ తీసుకురండి” అని చెప్పాడు. సమాజపు వారు బలులనూ కృతజ్ఞతార్పణలనూ తీసుకొచ్చారు. దహన బలులను అర్పించడానికి ఎవరికి ఇష్టమయిందో వారు వాటిని తీసుకొచ్చారు.
Ezra 6:17దేవుని ఆలయ ప్రతిష్ఠ సమయంలో 100 ఎద్దులను, 200 పొట్టేళ్ళను, 400 గొర్రె పిల్లలను వధించారు. ఇవిగాక, ఇశ్రాయేలీయులందరి పక్షంగా పాపపరిహారార్థ బలిగా ఇశ్రాయేలు గోత్రాల లెక్క ప్రకారం 12 మేకపోతులను బలిగా అర్పించారు.
Psalms 66:15పొట్టేళ్ల హోమం ఘుమఘుమలతో కొవ్విన జంతువులను నీకు దహనబలిగా అర్పిస్తాను. ఎద్దులను, పోతుమేకలను అర్పిస్తాను. 1
Luke 1:74-75 మనం మన శత్రువుల చేతిలోనుంచి విడుదల పొంది, 1 పరిశుద్ధంగా బతికినన్నాళ్ళు ఆయన సన్నిధానంలో, 1 పవిత్రతతోను న్యాయప్రవర్తనతోను ఉంటూ, 1 భయం లేకుండా ఆయనకు సేవ చేస్తాము అన్నదే, 1 మన పూర్వీకుడైన అబ్రాహాముకు ఆయన చేసిన ప్రమాణం. 1