Genesis 14:20
నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవునికి స్తుతి కలుగు గాక” అని చెప్పాడు. అప్పుడు అబ్రాము అతనికి తనకున్న దానిలో పదవ వంతు ఇచ్చాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
21సొదొమ రాజు “మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నువ్వే తీసుకో” అని అబ్రాముతో అన్నాడు.
Cross References
Genesis 24:27“అబ్రాహాము అనే నా యజమాని దేవుడైన యెహోవాకు స్తుతి కలుగు గాక! ఆయన నా యజమానికి తన నిబంధన విశ్వాస్యతనూ, తన విశ్వసనీయతనూ చూపడం మానలేదు. నన్నయితే ఆయన సరిగ్గా నా యజమాని బంధువుల ఇంటికే నడిపించాడు” అన్నాడు.
Genesis 47:24నాలుగు భాగాలు మీవి. పంటలో అయిదవ భాగం మీరు ఫరోకు ఇవ్వాలి. అది పొలాల్లో విత్తడానికీ మీ పిల్లలకూ మీ ఇంట్లోవారి ఆహారానికి” అని ప్రజలతో చెప్పాడు.
Leviticus 27:30ధాన్యంలో, చెట్ల కాయల్లో, భూమి ఫలమంతటిలో పదవ వంతు యెహోవా స్వంతం. అది యెహోవాకు ప్రతిష్ఠితం అవుతుంది.
Deuteronomy 12:17మీ ధాన్యంలో, ద్రాక్షారసంలో, నూనెలో, దశమ భాగం, మీ ఆవులు, గొర్రెలు, మేకల్లో తొలిచూలు పిల్లల్లో, మీరు చేసే మొక్కుబళ్లలో స్వేచ్ఛార్పణలు, ప్రతిష్ఠార్పణలు మీ ఇంట్లో తినకూడదు.
Deuteronomy 14:28మీ దేవుడు యెహోవా మీరు చేసే పని అంతటిలో మిమ్మల్ని ఆశీర్వదించేలా మూడు సంవత్సరాల కొకసారి, ఆ సంవత్సరం మీకు కలిగిన పంటలో పదో వంతుని బయటికి తెచ్చి మీ ఇంట్లో ఉంచాలి.
2 Samuel 18:28అంతలో అహిమయస్సు “రాజా, జయహో” అని గట్టిగా రాజుతో చెప్పి, రాజు ముందు సాష్టాంగపడి నమస్కారం చేసి “నా యేలిన వాడవైన రాజా, నిన్ను చంపాలని చూసిన వారిని అప్పగించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం” అన్నాడు.